TDP : జగన్ దోపిడీకి విజయసాయి రెడ్డి బాడి గార్డ్.. ఆనం రామనారాయణ షాకింగ్ కామెంట్స్! ఏపీలో వైసీపీ ప్రభుత్వ పనితీరుపై ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ దోపిడీ వ్యవస్థకు విజయసాయి రెడ్డి బాడి గార్డ్ గా పనిచేశాడంటూ విమర్శలు గుప్పించారు. జగన్ ఆత్మకూరు అభివృద్ధికి ఏమీ చేయలేదన్నారు. By srinivas 11 May 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి Nellore : నెల్లూరు జిల్లా ఆత్మకూరు టిడిపి(TDP) ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి(Anam Ramanarayana Reddy) జగన్ సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు. జగన్(YS Jagan) దోపిడీకి విజయసాయి రెడ్డి బాడీగార్డ్ అంటూ శనివారం పార్టీ కార్యలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో అన్నారు. ఈ మేరకు ఆత్మకూర్ లో ఎస్సీ ఎస్టీ మైనారిటీ, రైతులు మా ప్రచారం పట్ల చాలా బాగా మద్దతు పలికారని, అన్నీవర్గాల యువత టీడీపీ మద్దతుగా ఉన్నారని చెప్పారు. టీడీపీ పెట్టిన సూపర్ 6 పథకాల పట్ల మహిళలు బాగా ఆకర్షితులు అయ్యారని, వైసిపి ప్రభుత్వం ప్రజల ఆస్తుల హరించేందుకు నల్ల చట్టాలు తీసుకొచ్చిందని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి మీద పెట్టిన అన్నీ కేసుల్లో విజయ్ సాయి రెడ్డి రెండో వాడుగా ఉన్నాడని, విశాఖ పట్టణం లో జరిగిన విధ్వంసానికి విజయ్ సాయి రెడ్డి మొదటివాడు. దోపిడీ వ్యవస్థకి విజయసాయి రెడ్డి బాడి గార్డ్ గా పనిచేశాడు. నెల్లూరు జిల్లా ప్రజలను ఆయన మోసం చేస్తున్నాడంటూ మండిపడ్డారు. ఆత్మకూరుకు ఏ పని చేయలేదు.. వైసీపీ(YCP) వారే మైనారిటీ ల ఓట్ల కోసం రాజకీయాల స్వార్థం కోసం చేస్తున్నారని, కానీ చంద్రబాబు మీద అలా చెప్పడం తప్పు అన్నారు. 'మీ మీద ఉన్న క్రిమినల్ కేసులు కప్పి పుచ్చుకోవడం కోసం మరొకరి పై ఆరోపణలు చేయడం తగదు. సానుభూతి తో ఆత్మకూరులో గెలిచి.. అంతేకానీ ఆత్మకూరు కి ఏ పని చేయలేదు. మీ మీద పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. అది మీరే మీ అఫిడవిట్ లో చెప్పారు. జైళ్ల కి బెయిల్ల కి పరిమితమైన వ్యక్తులు విజయసాయి, విక్రమ్. మేము ప్రజలకు న్యాయం చేసే వాళ్ళం కాబట్టి ప్రజలకు మా మీద విశ్వాసం ఉంది. ప్రజలకు మా పట్ల ఉన్న నమ్మకం తోనే జిల్లాలో ఎక్కడ పోటీ చేసిన గెలుస్తున్నాం. మీ వల్లే వేల కోట్లు విలువ చేసే ఫ్యాక్టరీ తరలిపోయింది. దానివల్ల ఎంతో మంది నిరుద్యోగులు అయ్యారు. వరదల కారణంగా దెబ్బతిన్న సోమశిల జలాశయం అప్రాన్ ను రిపేరు చేయించలేకపోయారు. పదవులను అడ్డం పెట్టుకొని మీ పనులు చేసుకున్నారు కానీ ఈ ఆత్మకూరు అభివృద్ధికి మీరు ఏమీ చేయలేదు. మీది కార్పొరేట్ కల్చర్. మిమ్మల్ని నమ్మి 3 సార్లు ఓట్లు వేస్తే ఈ ఆత్మకూరు కి ఏమి చేయలేక పోయారు. నేను క్కడ గతంలో ఎంఎల్ఏ గా ఉన్నప్పుడు విద్య కు ప్రాముఖ్యత ఇచ్చి అన్నీ మండలాల్లో ఐటి ఐ లు పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేశాను. 100 పడకల హాస్పిటల్ ను ఏర్పాటు చేశాను. సోమశిల హైలెవల్ కెనాల్ కు సంబంధించి మీరు ఏమీ చేయలేకపోయారు. మీ సొంత మండలానికి మీరు ఏమి చేసారు కనీసం మంచినీళ్ళు ఇచ్చే స్థాయిలో కూడ లేరు. మీది కట్ & పెస్ట్ నాలెడ్జ్ అన్నారు. ఇది కూడా చదవండి: Nandyala: బన్నీకి బిగ్ షాక్.. నంద్యాలలో కేసు నమోదు! ఇక ఏదోక రోజు మీరు ఇద్దరూ జైలుకి వెళ్లాల్సి వస్తుందని, ఒక ఆర్థిక నెరగాడు అయిన వైఎస్ జగన్ ను అనుసరించారని, తర గురించి మాట్లాడే కనీస అర్హత మీకు లేదు. అన్నీ విధాల విఫలమయ్యారన్నారు. గ్రావెల్, ఇసుక అన్నీ వారి కనుసన్నల్లోనే జరిగాయి. అన్నీ విధాల మీరు వైఫల్యం చేసి ఈరోజు ఆత్మకూరు ప్రజలకు నంగనాచి కబుర్లు చెప్తున్నారు. సోమశిల హైలెవల్ కెనాల్ పూర్తి చేసి మర్రిపాడు మండలానికి మొత్తానికి తాగు సాగు నీరు అందిస్తాను. జిల్లా ఆసుపత్రి లో100 పడకల నుండి 300 పడకల ఆసుపత్రి గా ఏర్పాటు చేస్తా. నడి కుడి రైల్వే లైన్ ను పూర్తి చేస్తాం. సోమశిల జలాశయం మరమ్మత్తు పనులు పూర్తి చేస్తాం. ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ..ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ల ఏర్పాటు. 15 ఎకరాల స్థలం లో స్టేడియం నిర్మాణం. రోడ్లు నిర్మాణం ఆసంపూర్తిగా ఉన్న అన్ని నిర్మాణాలను పూర్తి చేస్తాని ఆనం రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. #nellore #cm-jagan #vijaya-sai-reddy #anam-ramanarayana-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి