Vijayasai Reddy: గెలుపే లక్ష్యంగా పని చేయాలి

పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వైపీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రంగంలోకి దిగారు. పలువురు వైసీపీ నేతలతో సమావేశమైన ఆయన.. వర్గ విభేదాలను పక్కన పెట్టి పార్టీ కోసం కష్టపడి పని చేయాలని సూచించారు.

New Update
Vijayasai Reddy : టీడీపీ, జనసేన వాటా ఇంతే: విజయసాయి రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయలు ఎటు వెళ్తున్నాయి. వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయా.? అందుకే ఆ ఎంపీ రంగంలోకి దిగాడా.? టీడీపీకి సపోర్ట్‌గా మాట్లాడుతున్న నేతలెవరూ..? వారికి ఎంపీ క్లాస్‌ పీకారా.? విభేదాలు ఎందుకొస్తున్నాయే ఆయన తెలుసుకుంటున్నారా.. లేక తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహించి వెళ్లారా.. ఏపీలో ఏం జరుగుతోంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలో ప్రాధాన్యత లేని నేతలు.. ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. మరోవైపు పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఎంపీ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. మంత్రి విడదల రజినితో సమావేశమైయ్యారు. నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, మైనారిటీ నేత జాన్ సైదాతో పాటు ఇతర నేతలతో మంత్రికి మధ్య వర్గ విభేదాలు నడుస్తున్నాయని తెలియడంతో రజినికి ఎంపీ క్లాస్‌ తీసుకున్నట్లు తెలస్తోంది. అంతే కాకుండా ఎంపీ, ఎమ్మెల్సీ, మైనార్టీ నేతతో సమావేశం అయిన ఆయన వారికి సైతం క్లాస్‌ తీసుకున్నట్లు సమాచారం.

మరో సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయన్న ఎంపీ.. అందరూ కలిసి పని చేయాలి కానీ గ్రూపు రాజకీయాలు పెట్టి ఇతర పార్టీల వారికి అవకాశం ఇవ్వొద్దని సూచించారు. మరోసారి ఇలాంటివి రిపీట్‌ అవుతే సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటామని ఎంపీ హెచ్చరించారు. గ్రామ స్థాయి నుంచి ప్రతీ కార్యకర్త గెలుపే లక్ష్యంగా పని చేయాలని, ఆ విధంగా పార్టీ నేతలు పని చేస్తూ.. కార్యకర్తలతో పని చేయించాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న వారిని అధిష్టానం గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తుందని సూచించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు