Maharaja Movie: విజయ్ సేతుపతి 50వ చిత్రం మహారాజ.. ఓటీటీ డీల్ వారితోనే..? కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి లేటెస్ట్ ఫిల్మ్ 'మహారాజ'. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. మహారాజ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు దక్కించుకుంది. By Archana 05 Jun 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Maharaja Movie: కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) లేటెస్ట్ మూవీ మహారాజ. సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు. మమతా మోహన్ దాస్ (Mamta Mohandas) కథానాయికగా నటించిన ఈ చిత్రంలో.. బాయ్స్ ఫేమ్ మణికందన్, అభిరామి, భారతిరాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్ పై జగదీష్ పళనిసామి, సుధన్ సుందరం సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన మహారాజ ట్రైలర్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం జూన్ 14న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతిని సెలూన్ షాప్ నడిపే 'మహారాజా' అనే వ్యక్తిగా కనిపించబోతున్నట్లు ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది. మహారాజ ఓటీటీ అప్డేట్ అయితే తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. మహారాజ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ తర్వాత నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఈ చిత్రం కన్నడ, తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తెలుగులో ఎన్‌వీఆర్ సినిమా ఈ చిత్రాన్ని విడుదల చేస్తుంది. కానీ రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. Also Read: Maharaja: ఎవరయ్యా ఈ లక్ష్మీ..? సస్పెన్స్ తో చంపేస్తున్న ‘మహారాజా’ ట్రైలర్..! #maharaja-movie #vijay-sethupathi #maharaja-ott-streaming #mamta-mohandas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి