Family Star: ఫ్యామిలీ స్టార్..పాపం విజయ్ దేవరకొండకు మళ్ళీ దెబ్బ పడినట్టుంది కదా...

ఏంటో పాపం...విజయ్ దేవరకొండకు కాలం కలిసి రావడం లేదు. వరుస ఫ్లాపులు తగులుతున్నాయి. లైగర్ తరవాత ఖుషి సినిమా కాస్త పర్వాలేదనిపించినా ఇప్పుడు తాజాగా విడుదల అయిన ఫ్యామిలీస్టార్ మళ్ళీ బాబుకు ఫ్లాప్‌నే అందించినట్టు ఉంది. మొదటి రోజునే టాక్ చాలా డల్‌గా ఉంది.

New Update
Family Star: ఫ్యామిలీ స్టార్..పాపం విజయ్ దేవరకొండకు మళ్ళీ దెబ్బ పడినట్టుంది కదా...

Family Star Movie Review: ఒక కుటుంబం చుట్టూ కథ, ఒక స్టార్ హీరో ఉంటే చాలు ...కథ,ఇతర విషయాలు ఇంకేం అక్కర్లేదు అనుకున్నట్టున్నారు అంటున్నారు ఫ్యామిలీ స్టార్ సినిమా చూసినవాళ్ళు. కాసింత గీత గోవిందం కి బడ్జెట్ పద్మనాభం , గ్యాంగ్ లీడర్ సినిమాలు కలిపి ... కృష్ణవంశీ సినిమాలో లాగా తెరనిండా జనాలు.. కథలని కథ ... గుండ్రంగా తిరిగే సన్నివేశాలు ... స్థూలంగా ఇది ఫ్యామిలీ స్టార్ కథ అని చెబుతున్నారు. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఎంత బాగా నటించి లాక్కొద్దామని ప్రయత్నించినా లాభం లేకపోయిందని అంటున్నారు. దాంతో పాటూ సర్ప్రైజింగ్‌గా ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్‌ (Mrunal Thakur) కూడా తీవ్రంగా నిరాశపరించని చెబుతున్నారు. కొంతమంది అయితే అరగంట కూడా చూడలేక వచ్చేవామని రివ్యూలు ఇస్తున్నారు.

కథ...
గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) కుటుంబం కోసమే బతికే కుర్రాడు. పెళ్లి అయి పిల్లలు కూడా ఉన్న అతడి అన్నయ్యలిద్దరూ ఇంకా జీవితంలో సెటిల్ కాకపోవడంతో కుటుంబం బాధ్యత అంతా తనే తీసుకుని వాళ్ల కోసం కష్టపడుతుంటాడు. తనను ఇష్టపడ్డ అమ్మాయిని సైతం కుటుంబం కోసం దూరం పెడతాడు. అలాంటి వ్యక్తి జీవితంలోకి ఇందు (మృణాల్ ఠాకూర్) వస్తుంది. తన ఇంటి మేడ మీదే అద్దెకు దిగి తనతో పాటు తన కుటుంబానికి కూడా బాగా దగ్గరవుతుంది ఇందు. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు గోవర్ధన్. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలోనే ఇందు గురించి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆ విషయం ఏంటి.. దాని వల్ల గోవర్ధన్ జీవితం ఎలా మలుపు తిరిగింది.. ఇంతకీ ఇందును గోవర్ధన్ పెళ్లి చేసుకున్నాడా లేదా.. తెలియాలంటే ఫ్యామిలీ స్టార్ సినిమా చూడాల్సిందే.

రివ్యూ...
ఇలాంటి పాత చింతకాయ పచ్చడి కథతో ఇంతకుముందే చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి కథనే మళ్ళీ పట్టుకుని వచ్చి చూపించాలని అనుకున్నాడు దర్శకుడు పరుశరామ్. ఇతని లాస్ట్ సినిమా సర్కారు వారి పాట ఎంత సిల్లీగా ఉందో...అంతకన్నా మమా సిల్లీగా ఉంది ఫ్యామిలీ స్టార్ అంటున్నారు జనాలు. ఒక మల్టీ నేషనల్ కంపెనీలో పని చేసే అమ్మాయి మిడిల్ క్లాస్ మనుషుల మీద థీససీస్ చేయాలనుకోవడం ఏంటో...దాన కోసం హీరో ఇంటి మీదకు అద్దెకు రావడం ఏంటో...అక్కడ హీరోగారి చేసే ప్రతీ పనికి మురిసిపోయి అతనికి పడిపోవడమేమిటో అంటున్నారు. ఏంటి బాబూ...కొంచెం కూడా మనుషుల్లా కనిపించడం లేదా అని అడుగుతున్నారు.

హీరోయిన్ మిడిల్ క్లాస్ మీద రిసెర్చ్ అయిపోయి సబ్మిట్ చేసేస్తుంది..ప్రోఫెసర్ చాలా పొగుడుతాడు కూడా. అయితే అక్కడే అసలు కథ మొదలవుతుంది. హీరోయిన్ విషయం తెలిసి ఆమె మీద పగబడతాడు హీరో. చివరకు వాళ్ళిద్దరూ రాజీ పడతారు. ఇదీ మొత్తం సినిమా థీమ్. ఇంత సిల్లీ పాయింట్‌ను దిల్‌ రాజు ఎలా ఒప్పుకున్నాడో తెలీదు. పరుశరామ్ ఎలా విజయ్‌ను కూడా ఎలా ఒప్పించాడో తెలియడం లేదని తెలుగు ప్రేక్షకులు నెత్తీ నోరు కొట్టుకుంటున్నారు. పోనీ కథ బాలేదు..సరే కనీసం కథనం అయితే బావుందా అంటే అది కూడా లేదు. మధ్యతరగతి కుటుంబంలో ఉండే హీరోలు అని చూపించాలనుకున్నాడు దర్శకుడు. కానీ దాన్ని సరిగ్గా మలచలేకపోయాడు. కథ మలుపు తిరగడానికి దారి తీసే పాయింటే పూర్తిగా తేడా కొట్టేసింది. మొదట్లో హీరో క్యారెక్టరైజేషన్ ఆసక్తికరంగా సాగడం.. కుటుంబం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు బాగుండడంతో ఒక దశ వరకు 'ఫ్యామిలీ స్టార్' ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తుంది. కానీ హీరోయిన్ పాత్ర రంగప్రవేశంతో మొత్తం పోతుంది. ఇక ధీసీస్ వ్యవహారం తెలిసిన దగ్గర నుంచీ అయితే మొత్తం సినిమానే గాడి తప్పేసింది. అక్కడ నుంచీ ప్రతీ సీన్ చాలా హాస్యాస్పదంగానే అనిపిస్తుంది. తన గురించి తన ఫ్యామిలీ గురించి థీసిస్ లో ఏదో రాసిందని.. హీరోయిన్ మీద హీరో రివెంజ్ తీర్చుకునే సన్నివేశాలు విసుగు పుట్టిస్తాయి.హీరో చిత్ర విచిత్ర ప్రవర్తనతో తెర మీద కథానాయికకే కాదు.. చూసే ప్రేక్షకులకు కూడా తిక్క రేగుతుంది. హీరోకు డబ్బులు లేకుంటే న్యూయార్క్ టైం స్క్వేర్‌లో వ్యభిచారానికి రెడీ అయ్యే సీన్ అయితే ఒక 'మాస్టర్ పీస్' అని చెప్పాలి. చివరిలో విలన్ ఎపిసోడ్ అయితే దాని గురించి అసలు చెప్పడానికి కూడా ఏం లేదు. మాట్లాడుకోవడం కూడా దండగ.

మొత్తానికి ఫ్యామిలీ స్టార్ ఒక దండగ సినిమా అంటున్నారు తెలుగు ప్రేక్షకులు. పాటలు కూడా ఏమీ ఆకట్టుకునే విధంగా లేవు. గోపీసుందర్ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా తీవ్రంగా నిరాశ పరిచాడు.సినిమా అంతా సన్నివేశాలతో సంబంధం లేకుండా ఆర్ఆర్ నాన్ సింక్ లో సాగినట్లు అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ బాగున్నా దాని వల్ల సినిమాకు ఉపయోగం ఏం లేదు.

రేటింగ్: 2.25/5

Also Read:IPL-2024: ఉప్పల్ దంగల్…టికెట్ల లొల్లి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

చనిపోయిన పందిని మళ్లీ బతికించారు ..!

చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్లి బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు.

author-image
By Archana
New Update

Life Style: ఇదొక మెడికల్ మిరాకిల్ అనే పదం వినే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే చైనాలో చోటుచేసుకుంది. చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్ళీ బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు. సాధారణంగా గుండె ఆగిపోయినప్పుడు.. మెదడు రక్తప్రసరణ కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే మెదడు కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితి ఇస్కీమియాకు దారితీస్తుంది. ఇస్కీమియా అనేది శరీరంలో కొంత భాగానికి రక్త ప్రవాహం తక్కువగా ఉండడం. సరైన రక్త ప్రవాహం లేకపోవడం వల్ల కణజాలాలకు అవసరమైన ఆక్సిజన్‌ అందదు. ఇలాంటి పరిస్థితిల్లో మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి శాశ్వతంగా మెదడు క్షీణించటం మొదలవుతుంది. అంతేకాదు  గుండెపోటు గుండెపోటు, స్ట్రోక్స్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది.

Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

చైనా శాస్త్రవేత్తలు అద్భుతం 

ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు చనిపోయిన పంది మెదడును బతికించిన ఫలితాలు .. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయిన నిమిషాల వ్యవధిలోనే మెదడు శాశ్వతంగా క్షీణించటం మొదలవుతుందనే భావనను సవాలు చేసేలా ఉన్నాయి. అయితే పందులు చనిపోయిన తర్వాత నాలుగు గంటల అనంతరం వాటి మెదళ్లను పాక్షికంగా పునరుద్ధరించిన ఘటన 2019లోనూ జరిగింది. 

బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి? 

మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినప్పుడు బ్రెయిన్ డెత్ సంభవిస్తుంది.

బ్రెయిన్ డెడ్ కారణాలు

  • మెదడుకు తీవ్రమైన గాయమైనప్పుడు
  • మెదడులో రక్తస్రావం జరగడం (ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్) 
  • ఇస్కీమిక్ స్ట్రోక్ ( సరైన ఆక్సిజన్ అందకపోవడం) 
  • గుండెపోటు
  • మెనింజైటిస్ లేదా ఎన్సెఫాలిటిస్ వంటి ఇంట్రాక్రానియల్ ఇన్ఫెక్షన్లు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: గంగవ్వకు బిగ్ బాస్ షాక్! పాపం అవ్వ.. ఇలా జరిగిందేంటి

Advertisment
Advertisment
Advertisment