Vijay Devarakonda : 'కల్కి' ఫ్యాన్ వార్ పై స్పందించిన రౌడీ హీరో.. అలాగే చూడండి అంటూ!

విజయ్ దేవరకొండ తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఇందులో 'కల్కి'ఫ్యాన్ వార్ పై స్పందించాడు. తెరపై విజయ్‌ దేవరకొండ, ప్రభాస్‌ అన్నట్లు చూడొద్దు. నన్ను అర్జునుడిగా.. ఆయనను కర్ణుడిగా మాత్రమే చూడండి.‘మహానటి’ ‘కల్కి’ రెండూ గొప్ప సినిమాలు. అందులో మేం నటించామని అన్నాడు.

New Update
Vijay Devarakonda : 'కల్కి' ఫ్యాన్ వార్ పై స్పందించిన రౌడీ హీరో.. అలాగే చూడండి అంటూ!

Vijay Devarakonda About Kalki Fan War : పాన్ ఇండియా స్టార్ (PAN INDIA STAR) ప్రభాస్ (Prabhas), దీపికా పదుకొణె (Deepika Padukone), అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన చిత్రం ‘కల్కి 2898 AD’. జూన్ 27 న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల మార్కును దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 415 కోట్లు వసూళ్లు సాధించి అదరగొట్టింది.

ఇదిలా ఉంటే రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) 'కల్కి’లో అర్జునుడి పాత్రలో కనిపించి అలరించిన విషయం తెలిసిందే. క్లైమాక్స్ లో అర్జునుడిగా విజయ్, కర్ణుడిగా ప్రభాస్ మధ్య యుద్ధ సన్నివేశం హైలైట్ గా నిలిచింది. ఈ క్రమంలోనే రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో దీనిపై ఫ్యాన్ వార్ కూడా నడిచింది. తాజాగా ఈ ఫ్యాన్ వార్ పై విజయ్ దేవరకొండ స్పందించాడు.

Also Read : బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేస్తుంది.. కంటెస్టెంట్స్ లిస్ట్ తెలిస్తే షాకే..!

తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన తన పాత్ర గురించి మాట్లాడుతూ.. " కల్కి సినిమా చూశా. చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఇండియన్‌ సినిమా మరో స్థాయికి వెళ్లింది. నాగీ, ప్రభాస్‌ అన్న గురించి చేసిన పాత్ర అది. అర్జునుడిగా మూవీ చివరిలో కనిపించడం, ఆ పాత్ర చేయడం నాకు సంతోషంగా ఉంది. తెరపై విజయ్‌ దేవరకొండ, ప్రభాస్‌ అన్నట్లు చూడొద్దు.

నన్ను అర్జునుడిగా.. ఆయనను కర్ణుడిగా మాత్రమే చూడాలి. నాగీ యూనివర్స్‌లో మేము పాత్రలు చేస్తున్నాం. నాగీ ప్రతి సినిమాలో నేను చేయడం తను లక్కీఛార్మ్‌ అని చెప్పొచ్చు. సినిమాలు బాగున్నాయి కాబట్టి నడుస్తున్నాయి. నేను చేయడం వల్లే అతడి సినిమాలు ఆడటం లేదు. ‘మహానటి’ ‘కల్కి’ రెండూ గొప్ప సినిమాలు. అందులో మేం నటించామంతే" అని చెప్పుకొచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు