గుంటూరులో మహిళ కిడ్నాప్ వివాదం ముగిసింది. టీడీపీ నాయకులు బలవంతంగా విడుదల రజినీ పేరుతో నామినేషన్ వేయించేందుకు ఆమెను ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు స్త్రీని గుర్తించి పోలీసులు ఇంటికి పంపించారు. స్వచ్ఛందంగానే నామినేషన్ వేసినట్లు బాధితురాలు తెలిపింది.
Vidadala Rajini Kidnapped: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కిడ్నాప్ ఇష్యూ కలకలం రేపింది. విడదల రజిని పేరుమీద ఒక మహిళతో బలవంతంగా నామినేషన్ వేయించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తమ ఇంటి మహిళను కిడ్నాప్ చేశారంటూ బాధితురాలి బంధువులు పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు.
దీంతో వెంటనే రంగలోకి దిగిన పోలీసులు సదరు మహిళను దొరకబట్టి నగరంపాలెం పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చినట్లు తెలిపారు. అయితే తాను స్వచ్ఛందంగానే నామినేషన్ వేసేందుకు సిద్దమైనట్లు ఆమె వెల్లడించిండంతో ముగిసిన కిడ్నాప్ వివాదం ముగిసింది. దీంతో నగరపాలెం పిఎస్ వద్ద నుంచి బంధువులు ఇంటికి తీసుకెళ్లినట్లు
పోలీస్ అధికారులు తెలిపారు.
BIG BREAKING: ఏపీలో మరో ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్!
ఏపీలో మరో ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 22న నోటిఫికేషన్ రిలీజ్ చేయనుండగా మే 13లోపు ఈఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.
BIG BREAKING: ఏపీలో మరో ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 22న నోటిఫికేషన్ విడుదలచేసి మే 9న పోలింగ్ జరగనుంది.
ఈ మేరకు ఒక రాజ్యసభ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించనుండగా.. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కించనున్నట్లు తెలిపారు. మొత్తంగా మే 13వ తేదీలోపు ఈఎన్నికల ప్రక్రియ పూర్తికానున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.