ఉదయాన్నే ఈ పనులు చేస్తే.. రోజంతా యాక్టివ్ రోజూ ఉదయం లేచిన వెంటనే మొబైల్ చూడకుండా కొన్ని నియమాలు పాటిస్తే యాక్టివ్‌గా ఉంటారు. ఉదయాన్నే ఫ్రెష్ అయ్యి వ్యాయామం చేయడం, సూర్యరశ్మిని ఆస్వాదించడం, ధ్యానం, పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం వంటి నియమాలు పాటిస్తే రోజంతా యాక్టివ్ మీ సొంతం. By Kusuma 06 Oct 2024 | నవీకరించబడింది పై 06 Oct 2024 09:24 IST in lifestyle Latest News In Telugu New Update షేర్ చేయండి ఉదయం లేచిన వెంటనే కొన్ని పనులు చేయడం వల్ల రోజంతా సంతోషంగా, యాక్టివ్‌గా ఉంటారు. అందరూ పొద్దున్న లేచిన వెంటనే మొబైల్ చూడటం స్టార్ట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల రోజంతా ఏదో చిరాకు, కోపంగా, ఒక్క పని కూడా సరిగ్గా జరగదు. అదే ఉదయం లేచిన వెంటనే ఈ పనులు చేస్తే రోజంతా సంతోషంగా ఉంటారు. ఇది కూడా చూడండి: పెరగనున్న సిమెంట్ ధరలు.. బస్తాపై ఎంతంటే? వ్యాయామం ఉదయం లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి.. మొబైల్ వంటివి చూడటం కాకుండా వ్యాయామం చేయాలి. రోజూ కనీసం అరగంట పాటు వాకింగ్, రన్నింగ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. రోజంతా అలసట, నీరసం లేకుండా యాక్టివ్‌గా ఉంటారు. సూర్యరశ్మి పొద్దున సూర్యరశ్మిలో ఉండటం వల్ల శరీరానికి విటమిన్ డి అందుతుంది. విటమిన్ డి శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంతో కూడా ఉపయోగపడుతుంది. ఇది కూడా చూడండి: కాసేపట్లో రాజేంద్రప్రసాద్ కుమార్తెకు అంత్యక్రియలు ధ్యానం ఎక్కువగా వాకింగ్, రన్నింగ్ వంటివి చేయలేని వాళ్లు మెడిటేషన్, యోగా వంటివి చేయడం వల్ల ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు. టిఫిన్ మిస్ కావద్దు రోజులో ఏ పూట అయిన ఫుడ్ తినడం మానేస్తే పర్లేదు. కానీ ఉదయం పూట టిఫిన్ మాత్రం అసలు మానకూడదు. ఉదయం పోషకాలు ఉండే పదార్థాలను తినడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఇది కూడా చూడండి: నేడు పాకిస్థాన్‌తో తలపడనున్న టీమిండియా #early-morning-tips #early-morning మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి