ఈ చేపల గుడ్లు కేజీ రూ.28.74 లక్షలు.. ఎందుకో తెలుసా?

కేవియర్ అనే చేపల గుడ్లు ఈ ప్రపంచంలోనే ఖరీదైనవి. ఇందులో అల్మాస్, బెలూగా, ఎసియేటర్, సెవ్రుగ అనే నాలుగు రకాల చేపలు ఉన్నాయి. అల్మాస్ చేపల గుడ్లు కిలో రూ. 28.74 లక్షలు ఉండగా.. మిగతా వాటి ధర రూ.20 లక్షల వరకు ఉంటుందట.

New Update
eggs

కేవియర్ అనే చేపల గుడ్లు వెరీ కాస్ట్లీ గురూ.. ఈ చేప గుడ్లు ధర ఎంతో తెలిస్తే తప్పకుండా షాక్ అవుతారు. అయితే ఈ కేవియర్‌లో నాలుగు రకాల చేపలు ఉంటాయి. ఒక్కో చేప బట్టి దాని రేటు ఉంటుంది. ఇందులో అల్మాస్, బెలూగా, ఎసియేటర్, సెవ్రుగ అని నాలుగు రకాలు ఉంటాయి. తినడానికి రుచిగా ఉండే ఈ చేపల గుడ్లు మాత్రం చాలా ఖరీదైనవి.

ఇది కూడా చూడండి: 'పవన్ కళ్యాణ్‌కు ఇది చెప్పాలనుకుంటున్నా'? షాయాజీ షిండే కామెంట్స్

ఇన్ని లక్షలా..

అల్మాస్ కేవియర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫుడ్. ఈ చేప గుడ్లు కిలో ధర 34,500 డాలర్లు ఉంటుందట. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 28.74 లక్షలన్నమాట. అయితే ఈ చేపలు స్టర్జన్ చేపల అండాశయం నుంచి రావడం వల్ల ఖరీదు ఎక్కువ ఉంటాయి. రెండోది బెలూగా కేవియర్ చేప ధర కిలో 20 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ చేపలను కాస్పియన్ సముద్రంలో గుర్తించారు. ఈ అరుదైన చేప గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఉంది. 

ఇది కూడా చూడండి: Karachi: విమానాశ్రయం వద్ద పేలుడు..ఇద్దరు మృతి!

ముత్యపు తెలుపు రంగులో ఉన్న అల్మాస్ కేవియర్ చేప తినడానికి ఉప్పగా, వగరుగా ఉంటుంది. ఇందులో విటమిన్ సీ, ఈ, ఏ పుష్కలంగా ఉంటాయి. ఈ చేపలను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎన్నో రకాల వ్యాధులను కూడా నివారిస్తుంది. ఇందులోని పోషకాలు శరీరానికి అలసట, బలహీనత రాకుండా ఉంచుతుంది.

ఇది కూడా చూడండి:  Sabarimala : షాకింగ్.. శబరిమల ప్రసాదంలో ఏముందంటే?

కేవియర్‌‌లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి మెదడు కణాలను రక్షించడంతో పాటు జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. ప్రెగ్నెన్సీ మహిళలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కేవియర్ చేపలను సౌందర్య ఉత్పత్తుల్లో కూడా వాడుతారంట. ఇందులోని యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో బాగా ఉపయోగపడతాయి. 

ఇది కూడా చూడండి: డ్రై ఫ్రూట్స్ నానబెట్టే ఎందుకు తింటారు..?

Advertisment
Advertisment
తాజా కథనాలు