పెరగనున్న సిమెంట్ ధరలు.. బస్తాపై ఎంతంటే?

ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో మూడు, నాలుగు త్రైమాసికంలో సిమెంట్ ధరలు భారీగా పెరగనున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. దేశంలో వరదల కారణంగా గత ఆరు నెలలు లాభాలు లేకపోవడంతో.. బస్తా మీద రూ.20 నుంచి రూ30ల వరకు పెంచనున్నట్లు సమాచారం.

New Update
cement2

సిమెంట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొన్ని రోజుల నుంచి నిలకడగా ఉన్న సిమెంట్ ధరలు.. ఈ ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగు త్రైమాసికంలో సిమెంట్ రేట్లు భారీగా పెరగనున్నట్లు సమాచారం. ఈ ఏడాది మొదటి ఆరు నెలలు భారీగా వర్షాలు పడటంతో సిమెంట్ డిమాండ్ తగ్గిపోయింది. మిగతా ఆరు నెలల్లో వీటి వినియోగం పెరిగే అవకాశం ఉండటంతో సిమెంట్ ధరలను పెంచాలని కొన్ని కంపెనీలు భావిస్తున్నట్లు ఓ నివేదిక తెలిపింది.

ఇది కూడా చూడండి: కాసేపట్లో రాజేంద్రప్రసాద్ కుమార్తెకు అంత్యక్రియలు

వరదల కారణంగా..

ఈ ఏడాది అనేక ప్రాంతాల్లో వరదలు ఎక్కువగా ఉండటం వల్ల సిమెంట్ డిమాండ్ 20 శాతం తగ్గింది. బస్తా మీద దాదాపుగా రూ.20 నుంచి రూ.30లు పెరగనున్నాయని నివేదికలు చెబుతున్నాయి. వార్షిక ప్రాతిపదికన సిమెంట్‌ డిమాండ్‌ 5 నుంచి 6 శాతం వరకు తగ్గింది. సిమెంట్‌ కంపెనీల సామర్థ్య విస్తరణ బట్టి 2.70 శాతం వృద్ధిని అంచనా వేసింది.

ఇది కూడా చూడండి: ఇక శబరిమలకు ఆన్‌లైన్ భక్తులకు మాత్రమే పర్మిషన్

2024-25 ఆర్థిక సంవత్సరం 3,4 త్రైమాసికాల్లో దక్షిణ, ఉత్తర భారత దేశంలో సిమెంట్ వినియోగం పెరుగుతుందని, రేట్లు పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి. డిమాండ్‌ పునరుద్ధరణ, ధరల పెంపుతో సిమెంట్‌ కంపెనీలు మిగతా  ఆరు నెలలు అయిన కూడా మెరుగైన ఆదాయం రావాలని రేట్లు పెంచడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఇది కూడా చూడండి: నేడు పాకిస్థాన్‌తో తలపడనున్న టీమిండియా

Advertisment
Advertisment
తాజా కథనాలు