Ooty: ఊటీ వాసులను కలిసి భయపెట్టిన చిరుత, ఎలుగుబంటి..ఒకేసారి, ఒకే ఇంటి దగ్గరకు.. ఈ మధ్య తరుచుగా వింటున్నాం...చిరుత పులి వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది అనే వార్తలు. దేశంలో చాలాచోట్ల ఈ జంతువులు మానవ నివాసాల్లోకి వచ్చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇవి ఒక్కొక్కటే వచ్చాయి..మరి రెండు కలిసి వస్తే...ఊటీలో అదే జరిగింది. By Manogna alamuru 08 Apr 2024 in Latest News In Telugu వైరల్ New Update షేర్ చేయండి Wild Animals In Residential Area: అడవిలో జంతువులు మన దగ్గరకు వస్తే...అమ్మో ఇంకేమైనా ఉందా. ఏదో ఏనుగు, జింక లాంటివి అంటే పర్వాలేదు కానీ అదే పులి, చిరుత, ఎలుగుబంటి లాంటివి అయితే భయంతో చచ్చిపోవడమే. ఒక జంతువు వస్తేనే గుండె ఆగిపోతుంది. అలాంటిది రెండు క్రూర జంతువులు కలిసి వస్తే. అప్పుడప్పుడు వింటుంటాం.. చిరుతపులి ఇంటి దగ్గరకు వచ్చిందని.. మరికొన్నిసార్లు వింటుంటాం.. ఎలుగుబంటి ఇంటి వద్ద తిష్టవేసిందని.. మరి ఈ రెండు కలిపి ఒకసారి.. ఒక ఇంటి వద్దకు రావడం చూశారా? ఊటీలోని రెసిడెన్షియల్ ఏరియాలో ఓ చిరుతపులి, ఎలుగుబంటి సంచరిస్తూ కనిపించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. Seems some secret meeting is taking place in that house. A leopard & bear decided to visit a house together near Ooty. Interesting !! pic.twitter.com/3067fTx7QM — Parveen Kaswan, IFS (@ParveenKaswan) April 6, 2024 ఈ వీడియోపై నెటిజన్లు భిన్నరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఆ ఇంట్లో ఏదో రహస్య సమావేశం జరుగుతున్నట్లుందని అంటున్నారు. చిరుతపులి, ఎలుగుబంటి కలిసి ఊటీకి సమీపంలోని ఒక ఇంటిని సందర్శించాలని నిర్ణయించుకున్నాయని జోకులు పేలుస్తున్నారు. Also Read:Andhra Pradesh: ఆంధ్రాలో ఎన్నికల ప్రచారం..పిచ్చ తిట్లు తిట్టుకుంటున్న అధినేతలు #bear #chirutha #ooty #residential-area మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి