Watch Video: క్లాస్ రూమ్‌లో కూలిన గోడ.. ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడ్డ విద్యార్థులు..

గుజరాత్‌లోని వడోదరలో శ్రీ నారాయణ్ స్కూల్‌లోని మొదటి అంతస్తులో ఉన్న ఓ తరగతి గది గోడ ఒక్కసారిగా కూలింది. దీంతో పలువురు విద్యార్థులు కిందపడిపోవడంతో వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఒక విద్యార్థికి తలపై తీవ్రంగా గాయమైనట్లు స్కూల్‌ ప్రిన్సిపల్ తెలిపారు.

New Update
Watch Video: క్లాస్ రూమ్‌లో కూలిన గోడ.. ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడ్డ విద్యార్థులు..

గుజరాత్‌లోని వడోదరలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం 12. 30 గంటలు శ్రీ నారాయణ్ స్కూల్‌లోని మొదటి అంతస్తులో ఉన్న ఓ తరగతి గది గోడ ఒక్కసారిగా కూలింది. దీంతో పలువురు విద్యార్థులు కిందపడిపోవడంతో వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. లంచ్‌ బ్రేక్ సమయంలో విద్యార్థులు క్లాస్‌లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థులు తమ సైకిల్స్‌ పార్కింగ్‌ చేసే స్థలంలో ఈ గోడ కూలింది. ఒక విద్యార్థికి తలపై తీవ్రంగా గాయమైనట్లు స్కూల్‌ ప్రిన్సిపల్ రూపాల్ షా తెలిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ‌లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Also Read: ఏపీ-ఒడిశా మధ్య నిలిచిన రాకపోకలు

పాఠశాల బిల్డింగ్‌ కట్టి 14 నుంచి 15 ఏళ్లు అవుతుందని స్థానిక సంస్కృత టీచర్‌ తెలిపారు. ఆ బిల్డింగ్‌ పాడైపోతుందని పాఠశాల యాజమాన్యానికి కూడా తెలుసని.. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. మరోవైపు నాసీరకంగా ఉన్న స్కూల్‌ భవనాన్ని ఎందుకు బాగు చేయించలేదని సోషల్ మీడియాలో నెటీజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్‌ను నడపాలంటే ప్రతిఏడాది బిల్డింగ్ సేఫ్టీ సర్టిఫికేట్‌ పొందాల్సి ఉంటుందని.. అసలు ఈ స్కూల్ సర్టిఫికేట్ తీసుకుందా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Also read: భారీ వర్షాలు.. భవనం కూలి మహిళ మృతి

Advertisment
Advertisment
తాజా కథనాలు