Venu Swamy : తలకిందులైన వేణుస్వామి జ్యోతిష్యం.. తప్పు ఒప్పుకుంటున్నానంటూ వీడియో రిలీజ్! ఎన్నికల ఫలితాలపై తాను చెప్పిన జాతకం తలకిందులు కావడంతో వేణుస్వామి మరో వీడియో రిలీజ్ చేశారు. 'నేను చెప్పినట్లే దేశంలో మోడీ ప్రభావం తగ్గింది. జగన్ విషయంలో తప్పును ఒప్పుకుంటున్నా. జాతకం ఆధారంగానే ఫలితాల గురించి చెప్పాను' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 04 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ నేషనల్ New Update షేర్ చేయండి 2024 Elections : దేశప్యాప్తంగా వెలువడుతున్న ఎన్నికల ఫలితాలపై (Elections Results) ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి (Venu Swamy) మరో వీడియో రిలీజ్ చేశాడు. ఈ ఏడాది కూడా జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నాడంటూ బల్లగుద్ది చెప్పిన వేణుస్వామి జ్యోతిష్యం తలకిందులైంది. దీంతో తనపై ఎలాంటి ప్రభావం పడకుండా ముందుగానే సర్దుకున్న వేణుస్వామి.. కేంద్రంలో తాను చెప్పినట్లు మోడీ (PM Modi) ప్రభావం తగ్గిందని, ఏపీలో మాత్రం అంచనాలు తప్పాయన్నారు. అయితే తాను జాతకం ఆధారంగానే ఫలితాల గురించి చెప్పడం జరిగిందన్నారు. తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు, ట్రోల్ చేస్తున్నారన్నారని వాపోయారు. తాను చెప్పింది 100శాతం తప్పు అయిందని, తన తప్పును ఒప్పుకుంటున్నానని చెప్పాడు. తనకు మద్ధతుగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. ఇక ఆయన గతంలో చెప్పిన జాతక ప్రకారం జగన్ (YS Jagan) సీఎం అయ్యే యోగం ఉందన్నారు. జగన్‌ది ఆరుద్ర నక్షత్రం. 2023 నుంచి అష్టమన శని మొదలైంది. రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. అయినా అది మంచి స్థానంలో ఉంది. దీన్ని బట్టి సీఎం అయ్యేది ఆయనే అని అర్థం చేసుకోవచ్చు. అలాగే చంద్రబాబుది పుష్యమి నక్షత్రం పవన్ కల్యాణ్‌ది ఉత్తరాషాడ నక్షత్రం 2017 నుంచి 2025 వరకు శని ఉంది. జూలై వరకు దాని ప్రభావం ఉంటుందని వేణు స్వామి తెలిపారు. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత వైసీపీ విజయం ఖాయమైందని వేణు స్వామి వ్యాఖ్యనించారు. ఎవరెన్ని చెప్పినా 2024లో జగనే సీఎం అవుతారని వేణు స్వామి కుండబద్దలు కొట్టేశారు. మరో 17 ఏళ్లు ఆయన్ను కదిలించే శక్తి ఏది లేదని వేణు స్వామి చెప్పుకొచ్చారు. 2019 గెలిచిన జగన్ 2024,2029 ఎన్నికల్లో కూడా గెలుచి సీఎం అవుతారని వేణు స్వామి తెలిపారు. Also Read : జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ప్రతిపక్ష హోదా కూడా రాదు! #pm-modi #ys-jagan #venu-swamy #election-results మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి