Venu swamy: జ్యోతిష్యం జోలికి పోను.. ట్రోలర్స్ దెబ్బకు వేణుస్వామి యూటర్న్! ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినీతారలు, ప్రముఖుల జ్యోతిష్యం జోలికి వెళ్లనని ప్రకటించారు. గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానన్నారు. నాగచైతన్య- శోభిత విడిపోతారంటూ ఆయన చెప్పిన జ్యోతిష్యంపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. By srinivas 12 Aug 2024 in సినిమా తెలంగాణ New Update షేర్ చేయండి Venu swamy: సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నాగచైతన్య- శోభిత ధూళిపాల నిశ్చితార్థం తర్వాత మరోసారి కాంట్రవర్సీకి తెరలేపి విమర్శలపాలవున్న జ్యోతిష్యుడు ఇకపై సెలబ్రిటీల లైఫ్ కు సంబంధించి జ్యోతిష్యం చెప్పనని ప్రకటించాడు. చైతూ, శోభిత నాలుగేళ్ల తర్వాత విడిపోతారని చెప్పడంతో అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వేణుస్వామిపై దుమ్మెత్తిపోశారు. విపరీతంగా ట్రోల్స్ మొదలుపెట్టారు. దీంతో తాజాగా స్పందించిన వేణుస్వామి ఇకపై సినిమా, రాజకీయ రంగాల వారి జాతకాలు చెప్పనంటూ యూటర్న్ తీసుకున్నాడు. చెప్పిన మాటకు కట్టుబడి ఉంటా.. వేణుస్వామి మాట్లాడుతూ.. 'గతంలో నేను చెప్పిన మాటకు కట్టుబడే ఉన్నా. అప్పుడు నాగచైతన్య- సమంత జ్యోతిష్యం చెప్పాను. అందుకే వేణుస్వామి దానికి కొనసాగింపుగా నాగచైతన్య-శోభిత భవిష్యత్తు చెప్పాల్సి వచ్చింది. నేను సెలబ్రెటీల జ్యోతిష్యం జోలికి పోను. అభిమానులు కూడా నా నుంచి జ్యోతిష్యం ఆశించవద్దు. మా ప్రెసిడెంట్ మంచు విష్ణుతో కూడా వివరంగా మాట్లాడిన' అంటూ చెప్పుకొచ్చాడు. ఇది కూడా చదవండి: Drugs case: రాజ్ తరుణ్-లావణ్య కేసు.. మస్తాన్ సాయి అరెస్ట్! అసలేం జరిగిందంటే.. ఇటీవల ఎంగేజ్ మెంట్ చేసుకున్న నాగచైతన్య-శోభిత జాతకాలు కలవలేదంటూ బోర్డు మీద క్లుప్తంగా వివరించాడు వేణుస్వామి. అయితే 2027లో నాగచైతన్య-శోభిత విడిపోతారని చెప్పిన వేణుస్వామి.. ఓ అమ్మాయి వల్ల వీరిద్దరు కూడా వీడిపోతారన్నాడు. ఆయన వీడియో వైరల్ కాగా.. వేణుస్వామి వ్యాఖ్యలపై నెటిజన్స్ మండిపడ్డారు. వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని వివిధ సంఘాలు తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులు సైతం నాగచైతన్య-శోభిత జాతకాలు ఎవరు చెప్పమన్నారని మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి వెనక్కు తగ్గిన వేణుస్వామి సినీ తారలు, రాజకీయ నాయకులు, ప్రముఖుల జ్యోతిష్యం జోలికి వెళ్లనంటూ సారీ చెప్పాడు. #akkineni-naga-chaitanya #astrology #venu-swami #shobita-dhulipala మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి