Drugs case: డ్రగ్స్ కేసులో నటి వరలక్ష్మి అరెస్ట్.. జర్నలిజంపై విమర్శలు!

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిందంటూ వైరల్ అవుతున్న వార్తలను వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఖండించారు. డ్రగ్స్‌ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎలాంటి సమన్లు, ఫోన్‌ కాల్స్‌ రాలేదని స్పష్టం చేశారు. మీడియా సంస్థలు విలువైన జర్నలిజాన్ని కాపాడాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

New Update
Drugs case: డ్రగ్స్ కేసులో నటి వరలక్ష్మి అరెస్ట్.. జర్నలిజంపై విమర్శలు!

Varalaxmi Sarathkumar : డ్రగ్స్ కేసు(Drugs Case) లో అరెస్ట్ అయిందంటూ వైరల్ అయిన వార్తలపై నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌(Varalaxmi Sarathkumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని మీడియా సంస్థలు రేటింగ్ కోసం ఫేక్ న్యూస్(Fake News) క్రియేట్ చేస్తున్నాయంటూ సోషల్ మీడియా(Social Media) వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు జర్నలిజం విలువను కాపాడాలంటూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు.

అసలైన జర్నలిజాన్ని కాపాడండి..
ఈ మేరకు తనను ఎన్‌ఐఏ పోలీసులు(NIA Police) అరెస్ట్‌ చేశారనే వార్తలను ఖండిస్తూ.. 'డ్రగ్స్‌ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి సమన్లు, లేదా ఫోన్‌ కాల్స్‌ రాలేదు. నా ఫొటో ఉపయోగించి 'వరలక్ష్మి మేనేజర్‌కు నోటీసులు' అంటూ వార్తలు రాస్తున్నారు. మంచి వార్తలు దొరకకపోవడంతో పలు మీడియా సంస్థలు ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం నిజంగా బాధాకరం. విలేకర్లు, వెబ్‌సైట్స్‌కు నేను చెప్పేది ఒక్కటే. అసలైన జర్నలిజాన్ని కాపాడండి. నిజాలు రాయండి. ప్రముఖులు, సెలబ్రిటీల లోపాలు వెతకడం మానుకోండి. సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించేందుకు మేము చాలా కష్టపడుతున్నాం. మా పని మేము చేసుకుంటున్నాం. మీ పని మీరెందుకు చేయడం లేదు. సమాజంలో ఎన్నో సమస్యలున్నాయి. వాటిపై దృష్టి పెట్టండి. మా సహనాన్ని బలహీనతగా భావించొద్దు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు ఆపండి. పరువునష్టం కేసులు కూడా ట్రెండింగ్‌ అవుతున్నాయి' అంటూ హెచ్చరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు