Promise Day : ప్రేమకు ప్రతిజ్ఞ.. మీ ప్రేయసికి ప్రామిస్ డే విషెస్ చెప్పండి! ఒట్టు తిసి గట్టు మీద పెడితే నమ్మకం పోతుంది. ప్రామిస్ చేస్తే దాన్ని జీవితాంతం నిలబెట్టుకోవాలి. వాలంటైన్ వీక్‌లో ఐదో రోజు ప్రామిస్ డే. అది రేపే. మీ ప్రియమైన వారికి ప్రామిస్ డే నాడు ఎలా విషెస్ చెప్పాలో తెలుసుకోవడానికి ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Manogna alamuru 10 Feb 2024 in Latest News In Telugu Uncategorized New Update షేర్ చేయండి Valentine Week : చాక్లెట్ డే(Chocolate Day), టెడ్డీ డే(Teddy Day) తర్వాత వాలెంటైన్స్ వీక్(Valentines Week) లో వచ్చేది ప్రామిస్ డే(Promise Day). ఇది ఫిబ్రవరి 11న జరుపుకుంటారు. ప్రేమికులకు ప్రామిస్ డే ప్రత్యేకమైనది. వివాహంలో సప్తపది ఉన్నట్టే.. ప్రతీ ప్రేమలోనూ వాగ్దానాలుంటాయి. ప్రామిస్‌లను నిలబెట్టుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి బెస్ట్‌గా ఉండాలని. జీవితంలోని ప్రతి రంగంలోనూ ముందంజలో ఉండాలనుకుంటారు. వైవాహిక, ప్రేమ సంబంధంలో కూడా ఇలానే ఉండాలని అందరూ భావిస్తారు. స్త్రీ అయినా, పురుషుడైనా ప్రతి మనిషి తనను తాను సామాజికంగా, ఆర్థికంగా, ప్రేమపరంగా మంచి స్థితిలో ఉండాలని.. వ్యక్తిగత స్వేచ్ఛను అనుభవించాలని కోరుకుంటారు. ప్రామిస్ డే సందర్భంగా కొంతమంది ప్రేమికులు వాగ్దానాలు చేస్తుంటారు. మీరు కూడా మీ రిలేషన్‌ను మరింత బలోపెతం చేసుకోవడానికి ప్రామిస్‌డే నాడు వాగ్దానాలు చేయండి. అయితే వాటిని నిలబెట్టుకోవాల్సిందేనన్న విషయాన్ని మరవకండి. Also Read : Mithun Chakraborty : బాలీవుడ్ నటుడికి గుండెపోటు.. ఐసీయూలో చికిత్స మీ లవర్‌కు లేదా భాగస్వామికి ఇలా చెప్పండి: నా శరీరంలో ప్రాణం ఉన్నంత కాలం నిన్ను ప్రేమిస్తాను. నా ప్రేమకు ఏ అహం అడ్డు రానివ్వను. వాగ్దానాలు ఒక వ్యక్తిని గుర్తించేలా చేస్తాయి, వాగ్దానాలు సంబంధాలను బలోపేతం చేస్తాయి, వాగ్దానాలు జీవితాన్ని అందంగా మారుస్తాయి.. హ్యాపీ ప్రామిస్ డే..! నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతాను, నేను మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టను, నా జీవితాంతం మీకు మద్దతు ఇస్తాను.. హ్యాపీ ప్రామిస్ డే" ఇలా చెప్తే మీ లవర్ మిమ్మల్ని ఎప్పటికీ విడిచి పెట్టరు. నా ప్రతి శ్వాసపై నీకు మాత్రమే హక్కు ఉంది.. హ్యాపీ ప్రామిస్ డే..! నీ ప్రతి సంతోషం కోసం నా జీవితాన్ని అర్పిస్తానని ప్రమాణం చేస్తున్నాను. 7 జన్మలకు సరిపడా ఈ జన్మలోనే ప్రేమిస్తాను.. హ్యాపీ ప్రామిస్ డే..! ఈ లోకంలో అన్నిటికంటే పవిత్రమైనది ప్రేమ ఒక్కటే అని గుర్తుంచుకోండి.. ప్రామిస్ డే రోజున చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి మీ వంతు కృషి చేస్తానని మీ లవర్‌కు నమ్మకంగా చెప్పండి. Also Read : Teddy Day: గర్ల్‌ఫ్రెండ్‌కు ఏ కలర్ టెడ్డీ ఇవ్వాలి? #lovers #valentines-day #valentine-week #promise-day మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి