VH: ఎంపీగా పోటీ చేసి తీరుతా.. తేల్చి చెప్పిన వీహెచ్..! ఖమ్మం ఎంపీగా పోటీ చేసి తీరుతానని తేల్చి చెప్పారు పీసీసీ మాజీ చీఫ్ వీహెచ్. కొత్తగా వచ్చిన వాళ్ళు టికెట్లు అడిగితే తన లాంటి సీనియర్ల పరిస్థితేంటని ప్రశ్నించారు. నేనేం తప్పు చేశాను.. నన్ను ఎందుకు పక్కన పెట్టారని నిలదీశారు. By Jyoshna Sappogula 26 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి V Hanumantha Rao About MP Ticket: గాంధీ భవన్ నుండి పీసీసీ మాజీ చీఫ్ వీహెచ్ కీలక వ్యాఖ్యాలు చేశారు. ఎంపీగా పోటీ చేసి తీరుతానని తేల్చి చెప్పారు. ఖమ్మంలో (Khammam) చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నానని.. ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశానని అన్నారు. ఖమ్మం నుండి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ తనను అడుగుతున్నారని చెప్పుకొచ్చారు. Also Read: టికెట్ ఇస్తే ఓకే.. లేదంటే చేసేది ఇదే : మాజీ ఎమ్మెల్యే ఈ నేపథ్యంలోనే పలు ప్రశ్నలు సంధించారు. పార్టీ కోసం నా కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా? ఇండియాలో నాకంటే ఎక్కువ తిరిగే నాయకుడు ఉన్నారా? కొత్తగా వచ్చిన వాళ్ళు టికెట్లు అడిగితే నా లాంటి సీనియర్ల పరిస్థితి ఎంటని ప‌్రశ్నించారు. నేనేం తప్పు చేశాను. నన్ను ఎందుకు పక్కన పెట్టారని నిలదీశారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ తొలగించాలని డిమాండ్ చేశారు. లాస్ట్ టైం కూడా నాకు అన్యాయం జరిగిందని వాపోయారు. Also Read: ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండే సమాజాన్ని సృష్టించడమే లక్ష్యం: మోదీ ఏం ఉద్దరించారని.. మోదీకి సముద్రం లోపలికి వెళ్లి పూజలు చేయడానికి టైం ఉంది కానీ మణిపూర్ వెళ్ళడానికి టైం లేదని వ్యాఖ్యానించారు. ఏం ఉద్దరించారని సంకల్ప యాత్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడిని మేమే పుట్టించామని సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారన్నారు. దేవుడి పేరుపై ఓట్లు సంపాదించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ నేతలు భాష మార్చుకోవాలని సూచించారు. ఇప్పటికైనా ప్రధాని మణిపూర్ వెళ్ళాలని కోరారు. రాహుల్ గాంధీని గుడికి రానివ్వడం లేదు.. గుడులు మీ అయ్య జాగీర్లా? అని తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. #congress #khammam #v-hanumantha-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి