Uyyur: దళిత వాలంటీరుపై వైసీపీ నాయకుడు లైంగిక వేధింపులు పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మున్సిపాలిటీలోని రెండో వార్డ్ కౌన్సిలర్ వణుకూరి సుభద్ర భర్త వైసీపీ నాయకుడు వణుకూరి సురేష్ రెండో వార్డ్‌లో వాలంటీర్‌గా పనిచేస్తున్న నడకుదురు గమ్య శ్రీ అనే దళిత మహిళను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. By Vijaya Nimma 18 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి కోరిక తీర్చాలని... పార్టీ నాయకుడిగా కౌన్సిలర్ భర్తగా తరచూ తనతో సంభాషిస్తూ తన కోరిక తీర్చాలని వేధించేవాడు. మొదటి సచివాలయం అడ్మిన్‌తో గమ్యశ్రీకి చిన్న వివాదం రావడంతో ఆ వివాదంలో గమ్యశ్రీకి అనుకూలంగా కౌన్సిలర్ భర్త అయినటువంటి సురేష్ నిలబడ్డాడు.దీన్ని ఆసరాగా తీసుకుని ఓ రోజు గమ్యశ్రీ ఇంటికి వెళ్ళాడు. పార్టీ నాయకుడు కౌన్సిలర్ తమ ఇంటికి రావడంతో గమ్యశ్రీ భర్త కూల్ డ్రింక్ ఇవ్వడానికి సెంటర్‌కు వెళ్లాడు. దీన్ని అదునుగా తీసుకున్న సురేష్ గమ్యశ్రీ ని తన కోరిక తీర్చమని బలవంత పెట్టడంతో పాటు ఆమెని బలాత్కరించే ప్రయత్నం చేశాడు. ఇంతలో గమ్యశ్రీ భర్త రావడంతో సురేష్ వెళ్లిపోయాడు. Your browser does not support the video tag. తిట్ల దండకం మొదలెట్టారు ఈ విషయం భర్తకు సైతం చెప్పకుండా మిన్నుకుండిపోయింది. ఎవరికన్నా చెబితే ఏమనుకుంటారో బంధువులలో అల్లరి అయిపోతానని ఆలోచనతో భర్తకు కూడా చెప్పుకోలేదని తోటి వాలంటీర్లకు చెప్పుకుని బాధపడింది. తనను మానసికంగా శారీరకంగా వేధించవద్దని సురేష్‌ను పలుమార్లు వేడుకుంటున్నట్టు ఆమె తోటి వాలంటీర్లకు తెలిపింది. ఉద్యోగరీత్యా ఎవరితో కనబడిన నేను నచ్చలేదా..? వారు నచ్చారా..? అంటూ మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఒక భరించలేక తన భర్తకు కుటుంబ సభ్యులకు విషయం గమ్యశ్రీ తెలిపింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పెద్దమనుషులను తీసుకొని రెండో వార్డు కౌన్సిలర్ వణుకూరి సుభద్ర దేవి ఇంటికి వెళ్లారు. మాట్లాడటానికి వచ్చిన పెద్ద మనుషులపై కౌన్సిలర్ సుభద్ర దేవి ఆమె కుమార్తె మరియు ఆమె భర్త నిందితుడు వణుకురు సురేష్ వచ్చిన వారిపై తిట్ల దండకం మొదలెట్టారు. లేబర్ మంద లేబర్ బుద్దులు నా భర్తను అంటారా అంటూ కౌన్సిలర్స్ సైతం బాధితురాలపై విరుచుకుపడింది. Your browser does not support the video tag. న్యాయం కోసం.. ఇంటి సభ్యులు వెళ్లిన వారిపై భౌతికంగా దాడి చేశారు. ఈ వ్యవహారంలో మరో వైసీపీ నాయకుడు పామర్తి బాలాజీ సైతం వారిపై దౌర్జన్యానికి దిగాడు. దీంతో పోలీసులను ఆశ్రయిస్తే అన్నా తమకు న్యాయం జరుగుతుందని గమ్యశ్రీ కుటుంబ సభ్యులు భావించారు. న్యాయం కోసం దళిత మహిళా వాలంటీర్ అరణ్య రోదన తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడిపై కేసు నమోదు చేయాలని గత మూడు రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నానని కానీ ఇప్పటివరకు నిందితునిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పలుమార్లు రాజీ ప్రయత్నానికి పిలిచి తమను అవమానించారని ఈ రాజీ ప్రయత్నంలో పెద్ద మనిషిగా వ్వవహరించిన మున్సిపల్ చైర్మన్ మాట కూడా వినటం లేదని.. ఆవేదన వ్యక్తం చేస్తున్న భాదితురాలు. Your browser does not support the video tag. #krishna-district #uyyur #dalit-volunteer #sexually-assaulted #ycp-leader #penamalur-constituency మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి