Telangana Elections 2023: కేసీఆర్‌పై యోగీ ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లీం రిజర్వేషన్లు తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలకు అన్యాయం చేస్తోందని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. By B Aravind 25 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి మరికొన్ని రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. బీజేపీ అగ్రనేతలు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాగజ్‌నగర్‌లో నిర్వహించిన సభలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లీం రిజర్వేషన్లు తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ముస్లీం రిజర్వేషన్లు రద్దు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. 2017 కంటే ముందు యూపీలో పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలుసునని.. డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చాక ఒక్కరోజు కూడా అల్లర్లు జరిగిన సందర్భాలు లేవని వ్యాఖ్యానించారు. Also read: మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే మహిళలకు గుడ్‌న్యూస్.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు తెలంగాణలో ప్రస్తుతం రైతులు సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితులు నెలకొంటున్నాయని.. పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రధాని మోదీ 10 లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి.. 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని మిగతావి కూడా పూర్తి చేస్తారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రహస్య మిత్రులని.. వీళ్ల మధ్యలో ఎంఐఎం పార్టీ ఉందని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని పేర్కొన్నారు. Also read: రైతులకు రూ.300కే యూరియా.. కామారెడ్డిలో మోదీ! #telugu-news #telangana-news #telangana-elections-2023 #cm-yogi-aditya-nath మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి