పిత్తాశయంలో రాళ్లు.. వైద్యుడికి రూ.1.27 కోట్ల జరిమానా.. అసలేమైందంటే? కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన యువకుడికి తప్పుడు ఆపరేషన్ చేసిన సంఘటన యూపీలో చోటుచేసుకుంది. ఆరోగ్యం క్షీణించి శివమ్ మరణించడంతో బాధితుడి తండ్రి డాక్టర్ అరుణ్ పై ఫిర్యాదు చేశాడు. వైద్యుడికి రూ.1.27 కోట్ల జరిమానా విధించింది వినియోగదారుల ఫోరం. By srinivas 17 Dec 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన సదరు వ్యక్తి దగ్గర అడ్డగోలుగా డబ్బులు వసూల్ చేసిన ఓ డాక్టర్ ఆపరేషన్ చేశాడు. అయితే కొన్నాళ్లకు యువకుడు మరణించాడు. దీనిపై ఫ్యామిలీ విచారణ చేపట్టగా తప్పుడు ఆపరేషన్ చేసినట్లు బయటపడింది. దీంతో వైద్యుడికి భారీ జరిమాన పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలోని పతేపుర్ కు చెందిన జ్ఞాన్ దేవ్ శుక్లా అనే వ్యక్తి కొడుకు శివమ్ శుక్లా 2015లో కడుపునొప్పితోతో బాధపడ్డాడు. అయితే అతని అవస్థలు చూడలేక కుమారుడిని స్థానిక లోహియా ఆస్పత్రిలో అడ్మిట్ చేశాడు. అక్కడ అన్నీ పరీక్షలు నిర్వహించిన వైద్యులు పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే డాక్టర్ అరుణ్ కుమార్ అతనికి శస్త్రచికిత్స చేయాలని సూచించాడు. అయితే తమ లోహియా ఆస్పత్రిలో తగిన సౌకర్యాలు ఉన్నప్పటికీ అక్కడ వైద్యం చేయలేదు. ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్ వెళ్లాలని సూచించాడు. ఇది కూడా చదవండి : మాకు ఫ్రీ వద్దు.. బస్సు టికెట్ కొంటాం: ఖమ్మం మహిళలు ఈ క్రమంలో డాక్టర్ మాట నమ్మిన తండ్రికొడుకులు అక్కడికి వెళ్లారు. దీంతో దాదాపు రూ.40 వేల వరకు వసూలుచేసి శివముకు ఆ నర్సింగ్ హోమ్ లోనే అరుణ్ ఆపరేషను చేసి ఇంటికి పంపించాడు. అయితే కొద్ది రోజులకు శివమ్ ఆరోగ్యం క్షీణించి చనిపోయాడు. దీంతో బాదితుడి తండ్రి జ్ఞాన్ దేవ్ శుక్లా రాష్ట్ర కంజుమర్ ఫోరమ్ లో జరిగిన విషయంపై ఫిర్యాదు చేశాడు. వెంటనే దీనిపై విచారణ జరిపిన అధికారులు 2015 జులై 20 నుంచి 12% వార్షిక వడ్డీతో సహా కలిపి రూ.1.27 కోట్ల జరిమానా విధించారు. ఈ డబ్బును నెలరోజుల్లో చెల్లించాలని అరుణ్ కు ఆదేశించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. #doctor #uttarpradesh #fined మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి