Skin Care: వంటగదిలో ఉండే ఇవి వాడారంటే మీ చర్మం పాడవుతుంది కొన్ని పదార్థాలను ముఖానికి పూయకూడదని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. హోం రెమెడీస్‌లో శనగపిండి, వాల్నట్ స్క్రబ్, నిమ్మ, నారింజ, ఆపిల్ వెనిగర్ వంటివి చర్మానికి హాని కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు. మెరిసే చర్మం కోసం విటమిన్ సి సీరమ్ వాడితే మెరుగుపడుతుంది. By Vijaya Nimma 07 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Skin Care: అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికోసం సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. అందమైన చర్మం కావాలనే కోరికతో చాలా మంది ఇంటి చిట్కాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అనేక నివారణలు పాటిస్తారు. ఈ విషయానికి వస్తే కొన్ని కెమికల్ బ్యూటీ ప్రొడక్ట్స్‌ను నివారించేందుకు హోం రెమెడీస్‌ను (Home Remedies) పాటించాలని చెబుతున్నారు. కొన్ని రకాల రెమెడీలకు ఎలాంటి ఆధారం, వాటిపై ఎలాంటి శాస్త్రీయ పరిశోధన లేదు. అలాంటి వస్తువులు వాడితే.. చర్మానికి హానికరమని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మన చర్మం ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది. ఇంటర్నెట్‌లో పేర్కొన్న హోం రెమెడీ వాడితే చర్మంపై కూడా పనిచేస్తుందని గ్యారెంటీ ఉండదు. ఇలాంటి చర్మంమై ప్రయత్నింస్తే చెడు పరిణామాలు వస్తాయని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. శనగపిండి: సూర్యకాంతి వల్ల చర్మం (Skin) చాలా టాన్ అవుతుంది. టానింగ్‌ను తొలగించడానికి.. ఎక్కువగా శనగ పిండితో (Besan) స్క్రబ్బింగ్ ట్రై చేస్తారు. అయితే శనగపిండి చర్మాన్ని చికాకుపెడుతుంది. టాన్ చేసిన చర్మంపై శనగపిండిని ఉపయోగించకూడదని చెబుతున్నారు. టానింగ్‌ను తొలగించడానికి టొమాటో మంచిది. దీన్ని ముఖానికి అప్లై చేసిన తర్వాత చర్మంపై చికాకు వచ్చే అవకాశం తగ్గుతుంది. వాల్నట్ స్క్రబ్: కొందరూ స్కిన్ ఎక్స్‌ఫోలియేషన్ కోసం వాల్‌నట్ స్క్రబ్‌ను (Walnut Scrub) ఉపయోగిస్తారు. ఇలా చేస్తే ముఖం చర్మాన్ని పాడు చేసి, కణాలు చర్మానికి కష్టంగా ఉంటుంది. అందుకే ముఖాన్ని శుభ్రం చేయడానికి దీన్ని ఉపయోగించకూడదని చెబుతున్నారు. ముఖ్యంగా చర్మం దురదగా, సెన్సిటివ్‌గా ఉంటే వాటికి దూరంగా ఉంటే మంచది. వాల్‌నట్ స్క్రబ్‌కు బదులుగా పెరుగును (Curd) ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మానికి హాని కలిగించకుండా క్రమంగా డెడ్ స్కిన్ పొరను తొలగిస్తుంది. నిమ్మ, నారింజతో గ్లో: చర్మం గ్లో పెరగడానికి నిమ్మ (Lemon), నారింజను (Orange) ఉపయోగించే వారు ఈ రెమెడీని ఫాలో చేయోద్దు. ఈ రెండు చర్మంపై తీవ్రమైన చికాకును కలిగిస్తాయి. నిమ్మకాయ కాంతి సున్నితత్వాన్ని పెంచుతుంది. సూర్యరశ్మికి గురైనప్పుడు చర్మం నల్లబడుతుంది. మెరిసే చర్మం కోసం నియాసినామైడ్, విటమిన్ సి సీరమ్ వాడితే.. చికాకు కలిగించకుండా చర్మం ఛాయ పెరుగుతుంది. ఆపిల్ వెనిగర్: దీనిని ఎక్కువగా వాడుతారు. ముఖంపై దీనిని ఉపయోగించడం మానుకోవాలి. ఇది చర్మానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇది కూడా చికాకు కలిగించవచ్చు. దానికి ప్రత్యామ్నాయంగా లాక్టిక్ యాసిడ్ సీరమ్ చర్మంపై అప్లై చేయడానికి మంచిది.ఇది చర్మం పొడిబారకుండా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. మొటిమల మంచలు తగ్గుతాయి. ఇది కూడా చదవండి: పది నిమిషాల్లోనే పాత సోఫాను కొత్తగా మార్చుకోండి గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #skin #kitchen-itams #damaged మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి