Cholesterol: కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకుంటున్నారా?..ఈ నూనెలు వాడండి

ఏ నూనె పడితే అది వాడటం వల్ల కొలెస్ట్రాలు పెరిగిపోతాయి. అందుకే పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజల నూనె, ఆలివ్ నూనె, వేరుశెనగ నూనె వాడితే ఆరోగ్యానికి ప్రయోజనంతోపాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

New Update
Cholesterol: కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకుంటున్నారా?..ఈ నూనెలు వాడండి

Cholesterol: చెడు ఆహారం, జీవనశైలి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఆహారంతో పాటు వంట నూనెల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ నూనె పడితే అది వాడటం వల్ల కొలెస్ట్రాలు పెరిగిపోతాయి. కొన్ని వంట నూనెలు వాడటం వల్ల కొలెస్ట్రాలను తగ్గించుకోవచ్చు కూడా. ఆహారంలో మనం ఎక్కువగా నూనె పదార్థాలు తీసుకుంటూ ఉంటాం. దీని వల్ల కొలెస్ట్రాల్ కూడా చాలా వేగంగా పెరుగుతాయి. హైబీపీ, హార్ట్ ఎటాక్, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వంటి సమస్యలను వస్తాయి.

publive-image

అవిసె గింజల నూనె:

అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరంలో మంటను నివారిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే వంటలో ఆలివ్ నూనెను ఉపయోగించవచ్చు. అయితే దీన్ని వాడేటప్పుడు వేడెక్కకూడదని, ఫ్రిజ్‌లో పెట్టకూడదని నిపుణులు అంటున్నారు.

publive-image

ఆలివ్ నూనె:

భారతదేశంలో ఆలివ్ నూనె ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. మిడిల్ ఈస్ట్ లేదా మెడిటరేనియన్ దేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థితిలో ఉన్నాం. కాబట్టి దీని ధర ఎక్కువ. ఆలివ్ నూనె ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఇది ఆరోగ్యానికి ప్రయోజనకరం. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె ఉంటాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

publive-image

వేరుశెనగ నూనె:

వేరుశెనగ చాలా మందికి ఇష్టమైనది. కానీ దాని నూనెను ఎక్కువగా ఉపయోగించరు. దీనితో వంటలు చేస్తే ఆరోగ్యకరమని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇందులో విటమిన్ ఇ, ఫైటోస్టెరాల్ ఉంటాయని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: పెళ్లి కూతురు తాప్సీ ఎంట్రీ అదుర్స్‌..వైరల్‌ అవుతున్న వీడియో

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP News: ఏపీలో రాజ్యసభ ఎన్నిక.. చంద్రబాబు, అమిత్ షా భేటీలో కీలక నిర్ణయం.. అభ్యర్థి ఎవరంటే?

ఏపీలో త్వరలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలో కూటమి నుంచి బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగనుంది. ఈ రోజు అమిత్ షాతో చంద్రబాబు భేటీ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు బీజేపీ మీజీ చీఫ్ అన్నామలై, స్మృతీ ఇరానీలో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది.

New Update
Andhra Pradesh Rajyasabha Election

విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ ఇటీవల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఉన్న బలాబలాల దృష్ట్యా ఈ సీటు కూటమికే దక్కే ఛాన్స్ ఉంది. దీంతో కూటమి నుంచి ఈ సీటు కోసం ఎవరు బరిలో ఉంటారు అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజ్యసభ పోటీ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది.

టీడీపీ ఓకే..

అయితే.. బీజేపీకి ఈ సీటును ఇచ్చేందుకు కూటమిలో ప్రధాన పార్టీ అయిన టీడీపీ అంగీకరించినట్లు తెలుస్తోంది. జనసేన సైతం అందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్‌ అన్నామలై, మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీలో ఒకరిని ఏపీ నుంచి రాజ్యసభకు పంపించాలన్నది బీజేపీ ప్లాన్ గా తెలుస్తోంది. 

telugu-news | telugu breaking news

Advertisment
Advertisment
Advertisment