Women Life Style: స్త్రీలకు అనాస పువ్వు ఓ వరం.. ఎన్నో రుగ్మతలు మాయం!

అనాస పువ్వులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సీజనల్ వ్యాధులుతోపాటు కంటిచూపు, వికారం, వాంతులు, జ్వరం వంటి సమస్యలను అనాస పువ్వుతో ఉపశమనం కలుగుతుంది. అనాస పువ్వులు మ‌రిగించిన నీటిని తాగితే జలుబు, ద‌గ్గు, శ్వాస, జీర్ణ సంబంధిత స‌మ‌స్యలు తగ్గుతాయి.

New Update
Women Life Style: స్త్రీలకు అనాస పువ్వు ఓ వరం.. ఎన్నో రుగ్మతలు మాయం!

Women Life Style: మనం నిత్యం వంటల్లో వాడే అనాస పువ్వులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీనికి స్త్రీల్లో హార్మోన్లను సమతుల్యం చేసే శక్తి ఉంది. సంతానలేమి సమస్యతో బాధపడేవారు ఈ పువ్వులను తీసుకుంటే ఫలితం ఉంటుంది. అంతేకాదు.. శ్వాసకోశ సమస్యల నుంచి బయటపడొచ్చు. దీనిని ఆహారాలు, పానీయాలతో తాగితే.. సీజనల్ వ్యాధులు దరిచేరవు. దీనిని తినడం వల్ల కంటిచూపు, వికారం, వాంతులు, జ్వరం వంటి సమస్యలను అనాస పువ్వుతో ఉపశమనం కలుగుతుందని వైద్యులు అంటున్నారు.

నిద్రలేమి సమస్యకు అనాస పువ్వు అద్భుతం

ప్రస్తుత కాలంలో స్త్రీ, పురుషులంద్దరూ నిద్రలేమి సమస్యలో బాధపడుతున్నారు. ఇది చిన్న స‌మ‌స్య ఏ మాత్రం కాద‌ని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే.. అనాస పువ్వులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే నిద్రలేమిని ఎంతో త్వర‌గా నివారించుకుంటే ఆరోగ్యానికి అంత ముప్పు త‌గ్గుతుంది. అయితే.. నిద్రలేమిని నివారించ‌డంలో అనాస పువ్వు అద్భుతంగా ఉపయోగప‌డుతుంది. మ‌సాలా దినుసుల్లో ఒక‌టైన అనాస పువ్వు ప్రత్యేక‌మైన రుచి, వాస‌న క‌లిగి ఉంటుంది. ఎన్నో పోష‌క విలువ‌లు ఉన్న అనాస పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం.

అనాస పువ్వుతో ఎన్నో ప్రయోజ‌నాలు

నిద్రలేమి సమస్య ఉంటే అనాస పువ్వును బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవ‌చ్చు. దీనిని ఎలా తీసుకుంటే నిద్ర సమస్య దూరం అవుతుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఓ పాత్రలో గ్లాస్ వాట‌ర్ పోసి లైట్‌గా మరిగించాలి. ఈ నీటిలో రెండు అనాస పువ్వులు, అనాస పువ్వుల పౌడ‌ర్ వేసి బాగా మ‌రిగించి ఫిల్టర్ చేసుకోవాలి. ఈ నీటిని రాత్రి నిద్రించేందుకు గంట ముందు తాగాలి. ఇలా ప్రతి రోజు చేస్తే.. నిద్ర చ‌క్కగా ప‌డుతుంది. నిద్ర లేమి స‌మ‌స్య క్రమ‌క్రమంగా దూరం అవుతుంది. అనాస పువ్వులు మ‌రిగించిన నీటిని తాగితే జలుబు, ద‌గ్గు, శ్వాస, జీర్ణ సంబంధిత స‌మ‌స్యలు తగ్గుతాయి.

ఇది కూడా చదవండి: మీకు పానీపూరీ అంటే ఇష్టమా..? అయితే ఇది చదవాల్సిందే!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Inter Supplementary Exams : ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్.. ఫీజు చెల్లింపునకు తుది గడువు ఇదే

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.  

New Update
Inter Supplementary Exams

Inter Supplementary Exams

Inter Supplementary Exams:  ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. కాగా ఇంటర్‌ ఫలితాల్లో గణనీయమైన ఉత్తీర్ణత సాధించింది. గతం కంటే అత్యధిక శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు ఆధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.  


 Also Read :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా!
 
మే 12 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు తెలిపారు. కాగా ఫేయిలై విద్యార్థులు సబ్జెక్టులను బట్టి  ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు సప్లెమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించాల్సిందిగా బోర్డు తెలిపింది. ఏప్రిల్ 22 వరకు చివరి తేదీగా ప్రకటించింది. అలాగే సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగనున్నాయి.  

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!


ఈరోజు (శనివారం) ఉదయం సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా మంత్రి నారా లోకేష్  ఏపీ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి అత్యధికంగా పాస్‌ పర్సంటేజ్ నమోదు అవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. రెండో సంవత్సరంలో 83 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ప్రతీఏడు లాగే ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికదే పై చేయిగా నిలిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బాలికలు 71 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 64 శాతం ఉత్తీర్ణత పొందారు. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 81 శాతంతో బాలికలు ఉత్తీర్ణత పొందగా.. బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

Also Read :  అనుకున్నదే అయింది.. అఘోరీకి వర్షిణీకి పెళ్లైంది - వీడియో

Advertisment
Advertisment
Advertisment