Urvashi Rautela : 'NBK 109' మూవీ షూటింగ్ లో ప్రమాదం.. గాయపడ్డ హీరోయిన్!

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా 'NBK109' మూవీ షూటింగ్‌లో గాయపడింది. ఓ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ఊర్వశికి ఫ్రాక్చర్‌ అయ్యిందని.. అప్పటి నుంచి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు ఆమె టీమ్‌ తెలిపింది. ఊర్వశి ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Urvashi Rautela : 'NBK 109' మూవీ షూటింగ్ లో ప్రమాదం.. గాయపడ్డ హీరోయిన్!

Urvashi Rautela Met An Accident in 'NBK 109' Movie Shooting : టాలీవుడ్ లో వాల్తేరు వీరయ్య, బ్రో, ఏజెంట్, స్కంద వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. ప్రస్తుతం బాలయ్య - బాబీ కాంబోలో తెరకెక్కుతున్న 'NBK109' సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రెజెంట్ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. కాగా ఈ మూవీ షూటింగ్‌లో ఊర్వశి తీవ్రంగా గాయపడిందని.. దాంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు తాజా సమాచారం బయటికొచ్చింది.

ఓ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ఊర్వశికి ఫ్రాక్చర్‌ అయ్యిందని.. అప్పటి నుంచి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు ఆమె టీమ్‌ తెలిపింది. #NBK109 మూవీ మూడో షెడ్యూల్‌ కోసం ఊర్వశి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిందని ఆమె బృందం పేర్కొంది. ప్రస్తుతం ఊర్వశి ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మూవీలో ఊర్వశి రౌటెలాతో పాటు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తుండగా.. చాందిని చౌదరీ సైతం ఇతర పాత్రలో కనిపించనుంది.

Also Read : డాక్టర్ పట్టా అందుకున్న హైబ్రిడ్ పిల్ల.. సినిమాలకు గుడ్ బై!?

ఇక NBK109 మూవీపై ఇప్పటికే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా వీడియో గ్లింప్స్‌ విడుదల చేయగా.. అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు