Amith Shah: ఎన్నికల్లో టికెట్‌ కావాలంటే డబ్బులు పంపాలి.. అమిత్‌ షా పేరుతో మోసం!

ఓ మోసగాడు మాజీ ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసి అమిత్‌ షాను మాట్లాడుతున్నానని పేర్కొన్నాడు.మాజీ ఎమ్మెల్యే ఆయనతో కాసేపు సంభాషించిన తరువాత ఆ మోసగాడు టికెట్‌ కావాలంటే డబ్బులు పంపాలని తెలిపాడు.దీంతో అనుమానం వచ్చిన మాజీ ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

New Update
Amith Shah: ఎన్నికల్లో టికెట్‌ కావాలంటే డబ్బులు పంపాలి.. అమిత్‌ షా పేరుతో మోసం!

Amith Shah: మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు (Loksabha Elections) రానున్నాయి. ఈ క్రమంలో రాజకీయాల్లో హీట్‌ పెరగడంతో పాటు పార్టీలో టిక్కెట్లు అడిగే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ(BJP) కి ఈ టికెట్ల తాకిడి ఎక్కువగా ఉంది. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు బీజేపీ అగ్రనేతలను దువ్వడం మొదలు పెట్టారు.

సిఫార్సుల రౌండ్ కూడా ప్రారంభమైంది.దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు మోసగాళ్లు(Thug)  క్యాష్‌ చేసుకోవాలని రంగంలోకి దిగారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ లో ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మోసగాడు మాజీ ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసి అమిత్‌ షా(Amith Shah) ను మాట్లాడుతున్నానని పేర్కొన్నాడు. నిజమని నమ్మిన మాజీ ఎమ్మెల్యే ఆయనతో కాసేపు సంభాషించిన తరువాత ఆ మోసగాడు టికెట్‌ కావాలంటే డబ్బులు పంపాలని తెలిపాడు.

దీంతో అనుమానం వచ్చిన మాజీ ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విషయమై అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్ ఏరియా) ముఖేష్ చంద్ర మిశ్రా మాట్లాడుతూ బరేలీలోని నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ వినోద్ కుమార్ తరపున కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా లాగా నటిస్తూ ఓ ముఠా సభ్యులు టిక్కెట్‌ ఇప్పిస్తామంటూ రాజకీయ నాయకులను ఫోన్‌లో మోసం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రూపా గ్రామానికి చెందిన రవీంద్ర మౌర్య, మాజీ ఎమ్మెల్యే కిషన్ లాల్ రాజ్‌పుత్‌తో జనవరి 4, జనవరి 20, తేదీల్లో తొమ్మిది సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు విచారణలో తేలిందని ఆయన చెప్పారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను అనుకరిస్తూ మాట్లాడినట్లు, మాజీ ఎమ్మెల్యేకి టికెట్‌ ఇప్పిస్తానని ప్రలోభపెట్టి డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. ట్రూ కాలర్ యాప్‌లోని నంబర్‌ను తనిఖీ చేయగా, కేంద్ర హోం మంత్రి, కేంద్ర ప్రభుత్వం పేరిట ఐడీ కనిపించింది.

పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుసుకున్న రవీంద్ర సిమ్‌ ని నాశనం చేసినట్లు మిశ్రా పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన నంబర్ రవీంద్ర గ్రామానికి చెందిన హరీష్ అనే వ్యక్తి ఐడీలో నమోదైందని తెలిపారు. ఈ కేసులో హరీష్‌ను అదుపులోకి తీసుకున్నామని.. విచారణలో, అతను డిసెంబర్ 29, 2023న తన ఐడీపై ఈ సిమ్‌ను కొనుగోలు చేసినట్లు పోలీసులకు చెప్పాడు.

ఆ తర్వాత గ్రామానికి చెందిన రవీంద్ర మౌర్య, షాహిద్‌లు అతడిని బెదిరించి సిమ్‌ తీసుకెళ్లినట్లు హరీష్‌ పోలీసులకు తెలిపాడు. ప్రస్తుతం రవీంద్ర, షాహిద్ కోసం పోలీసులు వెతుకుతున్నారని మిశ్రా తెలిపారు. ఎవరికైనా ఇలాంటి మోసపూరిత కాల్ వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

Also read: భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు.. 144 సెక్షన్‌ అమలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: పహల్గాం హీరో.. టూరిస్టులకోసం ఉగ్రమూకలతో వీరోచిత పోరాటం.. హుస్సేన్‌ షాకు నెటిజన్ల సలాం!

పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన హార్స్ రైడర్ హుస్సేన్‌ షాకు నెటిజన్లు సలాం కొడుతున్నారు. పర్యాటకులకోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా విరోచితంగా పోరాడిన హుస్సేన్‌ను హీరోగా కీర్తిస్తున్నారు. అతనిమీదే ఆధారపడి బతుకున్న కుటుంబం మాత్రం రోధిస్తోంది.

New Update

Pahalgam Attack: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. పర్యటకులను బెంబేలెత్తించేలా ఉగ్రమూకలు బుల్లెట్ల వర్షం కురిపించి అమాయకుల ప్రాణాలు తీశారు. అయితే ప్రాణభయంతో పరిసరప్రాంతంలో ఉన్న వారంతా పరుగులుపెడుతుంటే.. ఉగ్రవాదుల దాడిని అడ్డుకునేందుకు హీరోలా ముందుకొచ్చాడు హార్స్‌రైడర్ సయీద్‌ అదిల్ హుస్సేన్‌ షా. పర్యటకులపై దాడికి  పాల్పడుతుంటే అడ్డున్నాడు. ఉగ్రమూకల నుంచి తుపాకులు  లాగేసుకునేందుకు ప్రయత్నించి, చివరికి వీరుడిలా ప్రాణాలు విడిచాడు. 

గుర్రం మీద తీసుకువెళ్తున్నపుడే..

ఈ మేరకు ఘటనకు సంబంధించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. పహల్గాంకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్‌ పర్యటక ప్రాంతంలో దాడి జరిగింది. సముద్రమట్టానికి 3వేల అడుగుల ఎత్తులో ఉన్న టులియన్‌ సరస్సుకు వెళ్లాలంటే బైసరన్‌ మీదుగా వెళ్లాలి. నడక, గుర్రపుస్వారీ తప్ప మరో మార్గం లేదు. ట్రెక్కింగ్‌కు వచ్చే వారంతా క్యాంపులు ఏర్పాటుచేసుకుంటారు. ఇందులో భాగంగానే హుస్సేన్.. పర్యటకులను పార్కింగ్ ప్రాంతం నుంచి బైసరన్ పచ్చిక బయళ్ల వద్దకు గుర్రం మీద తీసుకువెళ్తున్నపుడే ఈ అటాక్ జరిగింది. అతని విరోచిత మరణం తన కుటుంబాన్ని రోడ్డున పడేలా చేసినందుకు బాధగానే ఉంది. హుస్సేన్ ఆదాయంపైనే భార్యాపిల్లలు, తల్లిదండ్రలు ఆధారపడ్డారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని చెబుతున్నారు. 

Pahalgam Terrorist Attack
Pahalgam Terrorist Attack

 

Also Read: Pahalgam Terror Attack-Tollywood: క్షమించరాని క్రూరమైన చర్య..ఉగ్రదాడిని ఖండించిన సినీ ప్రముఖులు!

ఇక హుస్సేన్ మృతిపై స్పందించిన పేరెంట్స్.. ‘పనికోసం మా కొడుకు పహల్గాం వెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటలకు దాడి జరిగినట్లు తెలిసింది. మేము వెంటనే ఫోన్ చేశాం కానీ కలవలేదు. స్విచ్ఛాఫ్ వచ్చింది. సాయంత్రం 4.40 గంటల సమయంలో ఫోన్ రింగ్ అయింది కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు.  పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేయగా ఉగ్రదాడిలో మా బిడ్డకు గాయలైనట్లు చెప్పారు’ అని హుస్సేన్ తండ్రి సయ్యద్ హైదర్ షా చెప్పారు. కానీ చివరకు హుస్సేన్ మరణవార్త తెలిసి గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. 


Also read : ALH Dhruv choppers : ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!

 J&K Terror Attack | telugu-news | today telugu news J&K Terror Attack 

Advertisment
Advertisment
Advertisment