Tiger Viral Video: పులితో ఫొటోలు.. జోకులు? కాస్త భయపడండిరా బాబు..! వైరల్‌ వీడియో!

యూపీలోని పిలిభిత్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్కోనా గ్రామంలోని గోడపైకి ఆడపులి ఎక్కింది. పులికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. దీనిపై పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌ మొత్తాన్ని చదవండి.

New Update
Tiger Viral Video: పులితో ఫొటోలు.. జోకులు? కాస్త భయపడండిరా బాబు..! వైరల్‌ వీడియో!

'రేయ్.. పులిని దూరం నుంచి చూడాలి అనిపించింది అనుకో, చూస్కో .. పులితో ఫొటో దిగాలి అనిపించింది అనుకో, కొంచం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేసుకోవచ్చు. సరే చనువు ఇచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం, వేటాడేస్తది...' ఇది యమదొంగ సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్‌. ఈ డైలాగ్‌ను నిజం చేసే ప్రయత్నం చేశారు ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌ జిల్లా అత్కోనా గ్రామస్తులు.

పిలిభిత్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఓ టైగర్‌ అనుకోకుండా బయటకు వచ్చింది. తర్వాత దారి తప్పింది. అది కూడా ఆడపులి. పాపం చాలా బుజ్జిగా, క్యూట్‌గా ఉంది. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌ నుంచి 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లింది. అక్కడ అత్కోనా గ్రామం ఉంది. రాత్రి కావడంతో బయట ఎవరూ లేరు.. పులికి ఏమీ అర్థంకాలేదు. తన ఫ్రెండ్స్‌ కనుచూపు మేరలో కనిపించలేదు. దీంతో కాస్త టెన్షన్ పడింది. రోడ్డుపై ఒంటరిగా నడుస్తున్న ఆ పులికి ఓ ఇల్లు కనపడింది. వెంటనే ఆ ఇంట్లో ఆవరణలోకి ఎంట్రీ ఇచ్చింది. గోడ ఎక్కి కూర్చింది. ఉదయం లేవగానే ఆ ఇంట్లో వాళ్లు ఆ పులిని చూసి దడుచుకున్నారు. అయితే పులిమాత్రం తనకేమీ పట్టనట్టు.. తన చుట్టూ ఎవరూ లేనట్టు ఆ గోడపైనే ఉండిపోయింది.


గోడపైనే కునుకు:
ఆడపులి వచ్చిందన్న మేటర్‌ ఊర్లోవారందరికి తెలిసిపోయింది. పులి ఏం చేయడం లేదన్న విషయం అర్థమైంది. ఇంకేముంది.. పులిని చూసేందుకు ఎగబడ్డారు. అందరూ ఆ పులిని చుట్టుముట్టారు. పులిమాత్రం ఆ గోడపై అటు ఇటు నడుస్తూ ఉండిపోయింది. ఎటు పోవాలో అర్థంకాలేదు. పైగా అదే సమయంలో నిద్ర వచ్చింది. రాత్రంతా టెన్షన్‌తో నిద్ర లేకపోవడంతో 'ఆఆఆఆఆఆ' అని ఆవళించి ఓ కునుకు తీద్దామని గోడపైనే పడుకొని పోయింది. ఈ విషయం ఫారెస్ట్ అధికారులకు తెలిసింది. వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. సెల్ఫీల పిచ్చి ఎక్కువగా ఉండే ప్రజల నుంచి ఆ పులిని కాపాడడమే వారి తక్షణ కర్తవ్యం. దీంతో తమ బ్రెయిన్‌కు పదును పెట్టారు..! సుమారు 10 గంటల తర్వాత పులిని అటవీశాఖ అధికారులు విజయవంతంగా రక్షించారు. పిలిబిత్ టైగర్ రిజర్వ్ పశువైద్యుడు దక్ష్ గంగ్వార్ ఆ పులిని పరిస్థితిని పరిశీలించారు.

Also Read: వన్డేల్లో తోపుగాడు.. టెస్టుల్లో తుస్సుగాడు.. కావాలంటే ఈ లెక్కలు చూడండి!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు