Telangana: మెదక్‌ ఘటనపై బండి సంజయ్ సీరియస్‌.. చర్యలు తీసుకోవాలని ఆదేశం

మెదక్‌లో శనివారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. పోలీసులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హింసకి ఎవరు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

New Update
Telangana: మెదక్‌ ఘటనపై బండి సంజయ్ సీరియస్‌.. చర్యలు తీసుకోవాలని ఆదేశం

మెదక్‌ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. పోలీసులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హింసకి ఎవరు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధితుల పక్షాన పోలీసులు ఉండాలని సూచించారు. పోలీసుల చర్యలతోనే పరిస్థితులు చక్కబడతాయని.. ఏ ఒక్కరికీ కూడా కొమ్ము కాయొద్దని సూచించారు. మరోవైపు మెదక్‌ ఘటనపై ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు మెదక్ వెళ్తున్నట్లు ప్రకటించడంతో పోలీసులు ముందస్తుగా ఆయన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా.. మెదక్‌లో శనివారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 9 మందిని స్టేషన్‌కు తరలించిన పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

Also Read: అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు

Advertisment
Advertisment
తాజా కథనాలు