Aap VS Bjp: మా దగ్గర ఖాళీల్లేవు.. మంత్రిగారు: కేంద్ర మంత్రి హార్దీప్ సింగ్‌!

బీజేపీ లో ప్రస్తుతం ఖాళీలు లేవని కేంద్ర మంత్రి హర్దీప్ పూరి అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం మద్యం కుంభకోణంలో కూరుకుపోయిన తరుణంలో అతిషి ని మా పార్టీలో చేర్చుకుని మేమే ఇబ్బందులు సృష్టించుకోమంటూ కేంద్ర మంత్రి తెలిపారు.

New Update
Aap VS Bjp: మా దగ్గర ఖాళీల్లేవు.. మంత్రిగారు: కేంద్ర మంత్రి హార్దీప్ సింగ్‌!

AAP VS BJP:  బీజేపీ (BJP) లో ప్రస్తుతం ఖాళీలు లేవని కేంద్ర మంత్రి హర్దీప్ పూరి (Hardeep Puri) చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAp) మొత్తం మద్యం కుంభకోణంలో కూరుకుపోయిన తరుణంలో అతిషి(Atishi) ని మా పార్టీలో చేర్చుకుని మేమే ఇబ్బందులు సృష్టించుకోము. అతిషి లాంటి రాజకీయ కార్యకర్త కోసం మా సార్టీలో ఎలాంటి ఖాళీ లేదని హర్దీప్ పూరి అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరాలని తనపై ఒత్తిడి వచ్చిందన్న అతిషి ప్రకటనను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి తీవ్రంగా ఖండించారు.

ఆమ్ ఆద్మీ పార్టీలో అందరినీ మట్టికరిపించాలని బీజేపీ తలపెట్టిందని తనకు చెప్పారని అతిషి అన్నారు. మరో రెండు నెలల్లో మరో నలుగురు ఆప్ నేతలను అరెస్ట్ చేయాలని బీజేపీ అనుకుంటుందని... తనను, సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్ రాఘవ్ చద్దాను అరెస్టు ను కూడా చేస్తారని ఆప్‌ మంత్రి అతిషి అన్నారు. .

ఏప్రిల్ 19న ప్రారంభం కానున్న లోక్‌సభ ఎన్నికలకు (Loksabha Elections)  ముందు బూటకపు అవినీతి కేసులు పెట్టడం, ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టేందుకు ED వంటి కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించడం ద్వారా బీజేపీ నిజాయితీ లేనిదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. బీజేపీ ఈ వాదనలను తిరస్కరించింది. ఈడీ, ఆదాయపు పన్ను అధికారులతో సహా ఇతర ఏజెన్సీలు స్వతంత్రంగా, అవినీతిపై ప్రధాని నరేంద్ర మోడీ హామీలకు అనుగుణంగా పనిచేస్తున్నాయని నొక్కి చెప్పింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఆప్ పోరాటంలో అతిషి ముందు వరుసలో ఉన్నారు.

అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆప్ విచ్ఛిన్నమవుతుందని బీజేపీ భావించిందని, అయితే ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగిన ర్యాలీ తర్వాత నలుగురు నేతల అరెస్టు సరిపోదని బీజేపీ భావిస్తోందని అతిషి అన్నారు. తనను అరెస్టు చేసే ముందు ఈడీ తన ఇంటిపైనా, అతని బంధువుల ఇళ్లపైనా దాడులు చేసే అవకాశం ఉందని తనకు అంతర్గత సమాచారం ఉందని అతిషి ప్రకటించారు. అయితే "మేము కేజ్రీవాల్ సైనికులం, ... బీజేపీ బెదిరింపులకు భయపడబోము." అంటూ అతిషి పేర్కొన్నారు.

Also read: క్షీణిస్తున్న కేజ్రీవాల్‌ ఆరోగ్యం.. 14 రోజుల్లోనే..!

Advertisment
Advertisment
తాజా కథనాలు