Electoral Bonds : ఆ ఉద్దేశంతోనే ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ తీసుకొచ్చాం: నితిన్ గడ్కరీ

మంచి ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొచ్చిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విరాళాలు లేకుండా రాజకీయ పార్టీని నడిపించడం అసాధ్యమని పేర్కొన్నారు. ఆర్థిక వనరులు లేకుండా ఏ పార్టీ కూడా ముందుకెళ్లలేదని తెలిపారు.

New Update
Nitin Gadkari On Fuel Vehicles: భవిష్యత్తులో నో పెట్రోల్ వెహికల్స్..ప్రతి ఇంట్లో ఎలక్ట్రిక్ కారు..!

Nitin Gadkari : లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) సమీపిస్తున్నాయి. ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు ఏడు దశల్లో పోలింగ్(Poling) జరగనుంది. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలోకి దిగాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టు(Supreme Court) కు సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) అంశం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. 2017లో కేంద్రం తీసుకొచ్చిన పథకంపై సుప్రీం కోర్టు కొరడా ఝళిపించడం, అలాగే దీన్ని రద్దు చేయడంతో విపక్షాలు మోదీ సర్కార్‌పై తీవ్రంగా విమర్శలు చేశాయి. అయితే ఈ అంశంపై తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. మంచి ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. విరాళాలు లేకుండా రాజకీయ పార్టీని నడిపించడం అసాధ్యమని అన్నారు.

Also Read : సముద్ర జలాల్లో 110 మందిని రక్షించాం : భారత నావీ

గుజరాత్‌(Gujarat) లోని గాంధీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నితిన్ గడ్కరీ(Nitin Gadkari).. ఎన్నికల బాండ్లకు సంబంధించి మాట్లాడారు. ' అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఎలక్టోరల్ బాండ్ల పథకం గురించి జరిగిన చర్చల్లో నేను కూడా ఉన్నాను. ఆర్థిక వనరులు లేకుండా ఏ పార్టీ కూడా ముందుకు వెళ్లలేదు. కొన్ని దేశాల్లో రాజకీయ పార్టీలకు ప్రభుత్వమే నిధులు అందజేస్తుంది. మన దగ్గర అలాంటి వ్యవస్థ లేదు కాబట్టే.. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. పార్టీలు నిధులు పొందాలనేదే ఈ పథకం ఉద్దేశం. అధికారంలో ఉన్న పార్టీ మారిపోతే సమస్యలు తెలెత్తుతాయన్న కారణంతనే విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు బయటపెట్టలేదని గడ్కరీ వెల్లడించారు.

ఈ పథకంలో ఏవైన లోపాలు ఉంటే.. సరిదిద్దుకోవాలని సుప్రీంకోర్టు పార్టీలను కోరాల్సింది. ఇలాంటి ఆదేశాలు వస్తే్.. పార్టీలన్నీ కలిసి దీనిపై చర్చించాలని నితిన్ గడ్కరీ అన్నారు. ఇదిలాఉండగా.. ఎన్నికల బాండ్ల స్కీమ్‌ను రద్దు చేస్తూ.. సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సుప్రీం ఆదేశాల మేరకు.. కేంద్రం బాండ్ల వివరాలు ఎన్నికల సంఘానికి, ఎస్‌బీఐకి సమర్పించగా.. ఎస్‌బీఐ దాన్ని సుప్రీంకోర్టుకు అందించింది. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం వాటి వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచింది.

Also Read : సద్గురుపై పాము దాడి.. ఒకేసారి మూడు కాట్లు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live Breakings: న్యూస్ అప్డేట్స్

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

Earthquake: మరో చోట భారీ భూకంపం.. ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ భూ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. హిందూకుష్ ప్రాంతంతో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

Also Read :  కీచక ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. కోర్టు ఎన్నేళ్లు జైలు శిక్ష విధించిందంటే?

  • Apr 16, 2025 07:26 IST

    పోలీసింగ్‌లో నెంబర్‌ వన్‌గా తెలంగాణ..

    తెలంగాణలో పోలీసుశాఖ పనితీరు దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచింది. ‘ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌-2025’ పేరుతో టాటా ట్రస్ట్‌ మంగళవారం దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది.



  • Apr 16, 2025 07:25 IST

    కీచక ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. కోర్టు ఎన్నేళ్లు జైలు శిక్ష విధించిందంటే?



  • Apr 16, 2025 07:25 IST

    మరో చోట భారీ భూకంపం.. ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు

    అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

    earthquake



Advertisment
Advertisment
Advertisment