Kishan Reddy: వారి సర్టిఫికెట్ నాకవసరం లేదు.. కేసీఆర్, కేటీర్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్.. తనపై నిరంతరం విమర్శలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వారిచ్చే సర్టిఫికెట్లు తనకు అవసరం లేదని తేల్చి చెప్పారు. By Shiva.K 29 Sep 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి PM Modi Telangana Tour Schedule: తనపై నిరంతరం విమర్శలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR), మంత్రి కేటీఆర్‌లకు(KTR) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వారిచ్చే సర్టిఫికెట్లు తనకు అవసరం లేదని తేల్చి చెప్పారు. శుక్రవారం నాడు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చారా? అని ప్రశ్నించారు. అభివృద్ధి పనుల ప్రారంభానికి మోడీ రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ కేసీఆర్ పాల్గొనరని విమర్శించారు. ఇదే సమయంలో ఎంఐఎం తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంఐంఎ తాటాకు చప్పుళ్లకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరని అన్నారు. ఏదైనా ఉంటే బీఆర్‌ఎస్ వాళ్లను భయపెట్టుకోండంటూ సెటైర్లు వేశారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఇదే.. ఇదే సమయంలో తెలంగాణలో ప్రధాని పర్యటించినున్న తేదీలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అక్టోబర్ 1, 3వ తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారని తెలిపారు. అక్టోబర్ 1వ తేదీన పాలమూరులో జరిగే భహిరంగ సభలో పాల్గొంటారని, 3వ తేదీన నిజమాబాద్ సభలో పాల్గొంటారని తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా రూ. 13,545 కోట్లు తెలంగాణకు అంకితం చేయనున్నట్లు తెలిపారు. వచ్చే నెల 1వ తేదీన రూ. 543 కోట్లతో జక్లర్ నుంచి కృష్ణ కొత్త రైల్ వే పనులకు శంకస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అలాగే, కాచిగూడ నుంచి రాయచూర్ కొత్త రైల్ మార్గానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. రూ. 2661 కోట్ల ఖర్చుతో నిర్మించిన చర్లపల్లి నుంచి కర్ణాటక వరకు 230 కిలోమీటర్ల HPCL గ్యాస్ పైప్ లైన్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారన్నారు. దీని ద్వారా 37 లక్షల గ్యాస్ కలెక్షన్లకు అధనంగా మరో 36 లక్షల గ్యాస్ కలెక్షన్ ఇచ్చేందుకు అవకాశం ఉందని వివరించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రూ. 1932 కోట్లతో కృష్ణపట్నం నుంచి హైదరాబాద్ కు చమురు పైప్ లైన్ పనులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణలో రూ. 1.20 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయ్యిందని వివరించారు. 1947 నుంచి 2014 వరకు జాతీయ రహదారులు 2,500 కిలోమీటర్లు ఉటే.. 2014లో మోదీ అధికారంలోకి వచ్చాక అవి రెంట్టింపు అయ్యాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు లేనందున కేంద్ర పనులు ఆగిపోయానని ఆరోపించారు కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే స్టేషన్ల అధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో 75 ఎయిర్‌పోర్టులు ఉంటే.. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనలో 150 ఎయిర్ పోర్టులయ్యాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రానికి ఒక్క ఎయిర్ పోర్ట్ కూడా రాలేదని, ఇది నిజంగా దురదృష్టకరం అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. Live: Press Meet, @BJP4Telangana State Office, Nampally, Hyderabad. https://t.co/sNKoZZ7t6I — G Kishan Reddy (@kishanreddybjp) September 29, 2023 అక్టోబర్ 3వ తేదీన నిజామాబాద్‌కు ప్రధాని మోదీ.. అక్టోబర్ 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్‌కు రాబోతున్నారని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నిజామాబాద్‌లో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతారని తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ రూ. 8,021 కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేస్తారని తెలిపారు. 3వ తేదీన రూ. 6000 కోట్ఉల, 800 మెగా వాట్స్ ఎన్టీపీసీ ప్రాజెక్టును మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. 3 వ తేదీన ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి రాబోతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ అత్యాధునిక టెక్నాలజీతో నిర్మాణం అవుతోందన్నారు. అల్ట్రా సూపర్ టెక్నాలజీతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ టెక్నాలజీ ద్వారా బొగ్గు తగ్గడం, కార్బన్‌డయాక్సైడ్ తగ్గడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందన్నారు. అలాగే, నిజామాబాద్ ఇందూర్‌లో హెల్త్ ప్రాజెక్ట్ ప్రాంభిస్తారని ప్రధాని మోదీ తెలిపారు. రూ. 1300 కోట్లతో 493 బస్తి దవాఖానలు, క్రిటికల్ కేర్ లను ప్రారంభించనున్నారు ప్రధాని. 20 జిల్లా సెంటర్ లలో ఉన్న 50 పడకల హాస్పత్రులలో క్రిటికల్ కేర్ బ్లాక్ లను నిర్మించబోతున్నారని తెలిపారు కిషన్ రెడ్డి. రూ. 305 కోట్లతో 340 కిలోమీటర్ల మేర పూర్తయిన రైల్వే విద్యుదీకరణ లైన్‌ను ప్రారంభించనున్నారని తెలిపారు. పాలమారు, నిజామాబాద్ సభలను విజయవంతం చేయాలని, అన్ని వర్గాల ప్రజలు సభకు భారీగా తరలి రావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. Also Read: Nara Lokesh: స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా లోకేష్ కు స్వల్ప ఊరట.. హైకోర్టు కీలక ఆదేశాలు Vishal: సెన్సార్ బోర్డుపై హీరో విశాల్ చేసిన కామెంట్స్ వైరల్.. కేంద్ర ప్రభుత్వం సీరియస్..! #telangana #pm-modi #telangana-elections #pm-narendra-modi #pm-modi-telangana-tour-schedule మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి