Minister Classes : మంత్రిగారి పాఠాలు.. వైట్‌బోర్డ్‌పై భలే బొమ్మలు గీశాడుగా 📋!

వైట్‌బోర్డుపై దేశ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ గురించి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఎంతో చక్కగా వివరించారు. మూడు సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం నిన్న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై కేంద్రమంత్రి క్లాసులు చెప్పారు.

New Update
Minister Classes : మంత్రిగారి పాఠాలు.. వైట్‌బోర్డ్‌పై భలే బొమ్మలు గీశాడుగా 📋!

Union Minister Ashwini Vaishnaw Presentation : దేశం నిరంతరం అభివృద్ధి దిశగా పయనిస్తోంది. దేశ విదేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) చేస్తున్న కృషికి అన్నివైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మార్గదర్శకత్వంలో అటు కేంద్ర మంత్రి వర్గం ఎంతో ఉత్సహంగా పనిచేస్తోంది. ముఖ్యంగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్(Central Minister Ashwini Vaishnaw) తన మాటలతో చేతలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన ఓ క్లాసు కూడా చెప్పారు. స్కూల్‌లో టీచర్‌ లాగా బోర్డుపై బొమ్మలు గీశాడు. అవేవో ఆడుకునే బొమ్మలు కాదు.. అందులో చాలా మీనింగ్‌ ఉంది. అది దేశ అభివృద్ధికి సంబంధించి డయాగ్రమ్‌. వైట్‌బోర్డు(White Board) పై దేశ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ గురించి అశ్విని వైష్ణవ్ ఎంతో చక్కగా వివరించారు. ప్రధాని 'మేక్-ఇన్-ఇండియా' దార్శనికతకు అనుగుణంగా తన మంత్రిత్వ శాఖ ఎలా పని చేస్తుందో ఆయన చెప్పారు.


సెమీకండక్టర్ రంగంలో మరో ముందడుగు:
మూడు సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు నిన్న(ఫిబ్రవరి 29) ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మూడు యూనిట్ల నిర్మాణం వచ్చే 100 రోజుల్లో ప్రారంభమవుతుంది. ఈ విషయాన్నే అశ్విని వైష్ణవ్ డిటైల్డ్ గా ఎక్స్‌ప్లేన్ చేశారు. వైట్‌బోర్డ్‌పై చార్ట్ తయారు చేసి మరి వివరించారు. దేశంలో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యల గురించి నాలుగు నిమిషాల వీడియోలో మంత్రి కీలక సమాచారాన్ని ప్రజలకు అందించారు. డిజైన్ ఫ్యాబ్రికేషన్(FAB), అసెంబ్లీ-టెస్టింగ్-మార్కింగ్-ప్యాకేజింగ్(ATMP), ఎలక్ట్రానిక్స్ తయారీ లేదా సర్క్యూట్‌లు అనే నాలుగు ప్రధాన భాగాలపై ఆయన క్లాస్‌ ఇచ్చారు. సెమీకండక్టర్ల తయారీకి అత్యంత కీలకమైన, ఖరీదైన సామగ్రి ఈడీఏ పరికరాలు అని, క్యాడెన్స్, సినాప్సిస్, సిమెన్స్ అనే మూడు కంపెనీలు దీన్ని తయారు చేస్తున్నాయని చెప్పారు.

ఉపాధికి అవకాశం:
ఇకపై యూనివర్సిటీలు తమ విద్యార్థులకు తరగతి గదిలోనే కొత్త లైవ్ టూల్స్‌ను పరిచయం చేయగలుగుతాయన్నారు వైష్ణవ్‌. సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటు దేశంలో స్టార్టప్‌లు ఎదగడానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. రెండేళ్లలో మనం సాధించగలిగినది చాలా దేశాలు ఐదేళ్లలో కూడా సాధించలేకపోయాయని చెప్పుకొచ్చారు. ఈ సెమీకండక్టర్ యూనిట్ల ద్వారా 20 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు, అధునాతన టెక్నాలజీ పనుల్లో దాదాపు 60 వేల పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ యూనిట్లు డౌన్‌స్ట్రీమ్ ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ తయారీ, టెలికాం తయారీ, పారిశ్రామిక తయారీ, ఇతర సెమీకండక్టర్ కన్స్యూమర్ పరిశ్రమలలో ఉపాధి కల్పనను వేగవంతం చేస్తాయని సమాచారం.

Also Read : SSC CHSL తుది ఫలితాలు విడుదల..!

Advertisment
Advertisment
తాజా కథనాలు