Budget 2024: రూ. 3 లక్షల లోపు జీతం ఉన్న వారికి నో టాక్స్.. ఇంతకు ముందు ఉన్న పన్ను విధానాలను కొనసాగిస్తూనే కొత్త బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. కొత్త పన్ను విధానంలో కేంద్రం స్వల్ప మార్పులు చేసింది. దీంతో కొంతమంది వేతన జీవులకు ఊరట లభించింది. By Manogna alamuru 24 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి New Tax Slabs: వేతన జీవులకు పెద్ద రిలీఫ్ వచ్చింది. కొత్త పన్ను విధానంతో వారికి స్వల్ప ఊరట లభించింది. కొత్త బడ్జెట్ ప్రకారం ట్యాక్స్ సిస్టమ్ లో స్టాండర్డ్ డిడక్షన్ పెంచడంతో పాటు, శ్లాబుల్లోనూ స్వల్ప మార్పులు చేశారు. దీంతో కొత్త పన్ను విధానం ఎంచుకునే టాక్స్ పేయర్స్‌కు రూ.17,500 మేర ఆదా అవుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించారు. కొత్త పన్ను విధానాలు.. ₹ 3 లక్షల కంటే తక్కువ సంపాదిస్తున్న వ్యక్తులు ఇక మీదట అసలు పన్ను కట్టక్కర్లేదు. వారికి పన్ను రేటు శూన్యం . ఇంతకు ముందు ఉన్న ₹ 3 లక్షల నుంచి ₹ 6 లక్షల శ్లాబ్‌ను...ఇప్పుడు ₹ 3 లక్షల నుంచి ₹ 7 లక్షలకు పెంచారు . పన్ను రేటు, అంటే 5%, మారదు. అదేవిధంగా, ఇతర కొత్త పన్ను స్లాబ్‌లు రూ.7 లక్షల నుండి రూ.10 లక్షల వరకు 10%, రూ.10 లక్షల నుండి రూ.12 లక్షల వరకు 15%, ₹ 12 లక్షల నుండి ₹ 15 లక్షల వరకు 20%...₹ 15 లక్షలకు పైబడిన ఆదాయం వారు 30% టాక్స్‌లు కట్టాల్సి ఉంటుంది. మరోవైపు పన్ను స్లాబ్‌లను మార్చడమే కాకుండా ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్‌ను ₹ 50,000 నుండి ₹ 75,000కి మార్చింది కేంద్ర ప్రభుత్వం . రిబేట్ మొత్తంలో మాత్రం ఎటువంటి మార్పూ చేయలేదు. కాబట్టి రూ.7.75 లక్షల వరకు ఆదాయం కలిగిన వారు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుంది. కాబట్టి రూ.7.75 లక్షల వరకు ఆదాయం కలిగిన వారు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇది వర్తిస్తుంది. అలాగే..పింఛనుదారులకు కుటుంబ పెన్షన్‌లో కోత ₹ 15,000 నుండి ₹ 25,000 కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది . దీనిద్వారా పెన్షన్ పొందే వ్యక్తులకు ఉపశమనం లభించింది. రిటైర్మెంట్ తర్వాత మెరుగైన ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ కొత్త పన్ను విధానం ఉయోగపడుతుంది. ఇక ఆదాయపు పన్ను విధానంలో మార్పుల కారణంగా ప్రభుత్వం ₹ 7,000 కోట్ల ఆదాయాన్ని వదులుకోనుందని ఆర్థిక మంత్రి తెలిపారు . Also Read: budget 2024: బడ్జెట్ తర్వాత పడిపోయిన రైల్వే స్టాక్స్.. #tax #budget-2024 #slabs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి