/rtv/media/media_files/2025/03/26/KmJeFPZb7NlVFIi79svW.jpg)
Rajahmundry Anjali
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బొల్లినేని ఆసుపత్రిని ముట్టడించిన కిమ్స్ ఆసుపత్రి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టాయి. బొల్లినేని హాస్పిటల్‌లో బలవన్మరణానికి యత్నించింది ఫార్మ్-డీ విద్యార్థిని అంజలి. ప్రస్తుతం ఐసియూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంది. బొల్లినేని ఆసుపత్రిలో క్లినికల్ ట్రయల్ విభాగంలో పనిచేస్తున్న అంజలిని.. హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ దీపక్ లైంగిక వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేక .. మత్తు మందు ఇంజక్షన్ తీసుకుంది.
రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి వద్ద
— Telangana Awaaz (@telanganaawaaz) March 25, 2025
భారీ ఆందోళన
అంజలి అనే ఫార్మసిస్ట్ ఇంజక్షన్ తీసుకుని
ఆత్మ హత్యాయత్నం
కిమ్స్ లో పనిచేసే దీపక్ అనే సూపర్ వైజర్
టార్చర్ పెట్టడంతో సూసైడ్ కు యత్నించిన అంజలి
ప్రస్తుతం ఐసియూ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న అంజలి
కిమ్స్ ఆసుపత్రి… pic.twitter.com/NxTdTqTUym
Also read : ఛీ..ఛీ.. నేనలా అనలేదు.. హోంశాఖపై కోమటిరెడ్డి ట్వీట్!
మూడు పేజీల లేఖ
దీపక్ వేధింపులపై మూడు పేజీల లేఖ రాసింది అంజలి. శారీరకంగా, మానసికంగా దీపక్ వేధించాడంటూ లేఖలో వెల్లడించింది. అంజలి స్వస్థలం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి. విద్యార్థినికి న్యాయం చేయాలంటూ ఆమె కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థుల ఆందోళన చేపట్టారు. అంజలి ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Also Read : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఏయే నగరాల్లో ఎలా ఉన్నాయంటే?
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
సంఘటన స్థలాన్ని ఏఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీలు రమేష్ బాబు, భవ్యకిషోర్ పర్యవేక్షించారు. అంజలి తండ్రి నల్లపు దుర్గారావు ఫిర్యాదు మేరకు ప్రకాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించడంతో రాజానగరం, రాజ మహేంద్రవరం ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, ఆదిరెడ్డి వాసు ఆసుపత్రికి చేరుకున్నారు. అంజలి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెప్పడంతో మెరుగైన చికిత్స అందించాలని కోరారు.
Also read : బెట్టింగ్ యాప్ కేసులో కీలక మలుపు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Also read : టారిఫ్‌లు తగ్గించేందుకు మోదీ సర్కార్ చర్యలు..ట్రంప్ ఎఫెక్టేనా!