/rtv/media/media_files/2025/03/22/mQItc7Z3kldPZEM5WVLK.jpg)
ఆన్‌లైన్ గేమింగ్, క్రికెట్ బెట్టింగ్ల కోసం ఓ గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏకంగా సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. గ్రామ నిధులును బ్యాంకు నుంచి డ్రా చేసి బెట్టింగ్ లు పెట్టాడు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. గంజాం జిల్లాలోని రాధాదేయ్‌పూర్ గ్రామ పంచాయతీ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (పిఇఒ) ఖేత్రమోహన్ నాయక్‌ను ఒడిశా విజిలెన్స్ విభాగం శుక్రవారం అరెస్టు చేసింది. ప్రభుత్వ నిధుల నుండి రూ.43.01 లక్షలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకుంది. విచారణలో గ్రామ సర్పంచ్ తనకు తెలియకుండానే, తన సంతకాన్ని ఖేత్రమోహన్ ఫోర్జరీ చేసి డబ్బులను విత్‌డ్రా చేశారని వెల్లడించారు.
Also read : వేలంలో ట్విట్టర్ పాత లోగో.. భారీ ధర పలికిన ఐకాన్
Also Read : దారుణం... ఆర్టీసీ బస్సు టైర్ కింద పడి టెన్త్ విద్యార్థిని మృతి
డ్యూటీ ఎక్కిన మొదటి నెల నుంచే
యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లోని ప్రభుత్వ ఖాతాల నుండి నిధులను చెక్కుల ద్వారా నిధులను సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి డబ్బులను ఖేత్రమోహన్ విత్ డ్రా చేశాడు. ఆ నిధులను తన సొంత ఖాతాలోకి బదిలీ చేసుకుని బెట్టింగ్ లు పెట్టేవాడు. అయితే ఇందులోనే వృద్ధాప్య పెన్షన్ డబ్బులు కూడా ఉన్నాయి. యాప్ ద్వారా లాభాలు ఆర్జించిన తర్వాత ఆ నిధులను పంచాయతీ బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్లాన్ చేసినట్లు ఖేత్రమోహన్ అధికారులకు చెప్పాడు
2024జూలైలో ఉద్యోగంలో చేరిన నాయక్ డ్యూటీ ఎక్కిన మొదటి నెల నుంచే నిధులను స్వాహా చేయడం ప్రారంభించాడని దర్యాప్తు అధికారులు తేల్చారు. దొంగిలించిన డబ్బును ఆన్‌లైన్ గేమింగ్ , క్రికెట్ బెట్టింగ్ కోసం ఉపయోగించాడని అధికారులు వెల్లడించారు. అతనిపై అవినీతి నిరోధక చట్టం, 1988, భారతీయ న్యాయ సంహిత (BNS) సంబంధిత నిబంధనలతో పాటు, సెక్షన్లు 316(5), 336(3), 338, 340(2) కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
Also Read : నీ మొగుడ్ని వదిలేసి రా.. హైదరాబాద్ మహిళకు ఎన్ఆర్ఐ వేధింపులు
Also Read : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై RGV షాకింగ్ కామెంట్స్..