Meerut Murder case: జైలు భోజనం వద్దు.. డ్రగ్స్ కావాలని సాహిల్ డిమాండ్

మీరట్ మర్డర్ కేసులో అరెస్ట్ అయిన ముస్కాన్, సాహిల్ చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైలుకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. సాహిల్ భోజనం కూడా చేయడం లేదు. ముస్కాన్ మాత్రం తీవ్రంగా బాధపడుతుంది. సాహిల్ జైలు అధికారులు డ్రగ్స్ డిమాండ్ చేశాడని తెలుస్తోంది.

New Update
meerut

meerut

మీరట్‌లో భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారు జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. లండన్‌లో ఉద్యోగం చేస్తున్న సౌరభ్ రాజ్ పుత్ ఫిభ్రవరిలో ఇండియాకు వచ్చాడు. 2016లో అతను ముస్కాన్ అనే యువతిని ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నాడు. వారికి ఆరేళ్ల పాప కూడా ఉంది. ముస్కాన్‌ భర్త సౌరభ్ లండన్‌లో ఉంటుండటంతో ఇంట్లో పాపతో ఒంటరిగా ఉంటుంది. ఈక్రమంలోనే ముస్కాన్‌కు ఆమె స్కూల్ ఫ్రెండ్ సాహిల్ ఆన్‌లైన్‌లో పరిచయం అయ్యాడు. అది కాస్త ప్రేమగా మారింది. సాహిల్‌కు డ్రగ్స్‌ బానిసైయ్యాడు. నెమ్మదిగా ముస్కాన్‌కు డ్రగ్స్‌కు అలవాటైంది. ప్రియుడితో సెట్టిల్ అవ్వడానికి భర్త సౌరభ్ అడ్డు తొలగించుకుందామని ప్లాన్ చేసింది ముస్కాన్. సౌరభ్‌ను హత్య చేయడానికి సాహిల్ హెల్ప్ తీసుకున్నాడు. ఫిభ్రవరిలో ఇంటికి వచ్చిన సౌరభ్‌‌ను మార్చి 4న తినే ఆహారంలో  మత్తుమందు కలిపి చంపేసింది. ఆ తర్వాత సౌరభ్‌ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి డ్రమ్‌లో పూడ్చిపెట్టారు. 

రెండు వారాల తర్వాత సౌరభ్ హత్య బయటపడింది. దీంతో పోలీసులు సాహిల్, ముస్కాన్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. పూర్తిగా డ్రగ్స్‌కు అడిక్ట్ అయిన వారు జైలులో భోజనం చేయడం లేదు. వారు డ్రగ్స్ కావాలని పోలీసులను అడుగుతున్నారట. ప్రస్తుతం ముస్కాన్, సాహిల్ లను మీరట్ లోని చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైలుకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మొదట వారు ఇద్దరు కలిసి ఒకే ఉండాలని కోరారు. కానీ జైలు నిబంధనల ప్రకారం.. ముస్కాన్‌ను లేడీస్ బ్యారక్, సాహిల్‌ను పురుషుల గదిలో ఉంచారు.  జైలులో వేసినప్పటి నుంచి ముస్కాన్ బాధపడుతుంది. రాత్రి అంతా నిద్రపోలేదు. సాహిల్ మాత్రం సైలెంట్‌గా ఉంటున్నాడు. భోజనం తినకుండా డగ్స్ కావాలని జైలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. అతను ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకునే వాడని డాక్టర్లు చెబుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

యువతిపై దాడి.. నిందితుడు అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు

విజయనగరం జిల్లా శివారం గ్రామంలో అఖిల అనే యువతిపై దాడి చేసిన  నిందితుడు ఆదినారాయణను (21)ను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ వెల్లడించారు. 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించారు

New Update
a young women

a young women

విజయనగరం జిల్లా శివారం గ్రామంలో అఖిల అనే యువతిపై దాడి చేసిన  నిందితుడు ఆదినారాయణను (21)ను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ వెల్లడించారు. 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించారు. నిందితుడు దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అఖిల సోదరుడికి నిందితుడు ఆదినారాయణస్నేహితుడు. ఆమె కుటుంబ సభ్యులతోనూ ఆదినారాయణ సన్నిహితంగా ఉండేవాడు. 

Also read :  డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇద్దరి మధ్య వాగ్వాదం

అయితే ఇటీవల ఆమెకు అసభ్య సందేశాలు పంపడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే విషయమై అతడిని యువతి కుటుంబ సభ్యులు హెచ్చరించారు. దీంతో కక్ష పెంచుకున్న ఆదినారాయణ అఖిలపై కత్తితో దాడికి దిగాడు.  శనివారం ఇంటి ముందు బాధితురాలు బట్టలు ఉతుకుతున్న టైమ్ లో   కత్తితో పొడిచి పరారయ్యాడు. యువతికి పొట్టలో బలంగా కత్తిపోట్లు దిగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది.  

Also Read :  దేశానికి స్ఫూర్తినిచ్చిన పోరాటం..ఆ భూములపై కేటీఆర్ బహిరంగ లేఖ

వెంటనే చుట్టు పక్కల వారు గమనించి 108కి ఫోన్‌ చేశారు. ఆమెను చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయనగరంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్పృహలోకి రావడంతో  ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Also Read : Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

Also read :  మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!

Advertisment
Advertisment
Advertisment