/rtv/media/media_files/2025/03/25/blZQ7eCnK0NIZMzy9dy1.jpg)
నాలుగు సంవత్సరాలుగా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్న వ్యక్తి ఉదయం ఆమెను వివాహం చేసుకున్నాడు. తిరిగి అదే రోజు సాయంత్రం తన కుటుంబం చూపించిన మరొక మహిళ మెడలో తాళి కట్టాడు. ఈ సంఘటన గోరఖ్‌పూర్‌లోని హర్పూర్ బుధాట్ ప్రాంతంలో జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
Also Read : పోలీసుస్టేషన్ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్!
Also read : VIDEO VIRAL: తెలంగాణలో ఘోరం.. చెరుకు రసం మిషన్లో ఇరుక్కుకున్న మహిళ జుట్టు
నాలుగు సంవత్సరాలుగా డేటింగ్
బాధితురాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు నాలుగు సంవత్సరాలుగా తనతో డేటింగ్ లో ఉన్నాడని.. ఆ సమయంలో తనకు రెండుసార్లు ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ కూడా చేయించాడని తెలిపింది. అయితే ఆ వ్యక్తికి ఇప్పటికే ఇంట్లో ఓ పెళ్లి సంబంధం ఫిక్స్ చేశారని తెలియడంతో తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో కోర్టులో పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో వెల్లడించింది.
Also read : Ramadan: రంజాన్ పండగ సందర్భంగా ముస్లింలకు బీజేపీ స్పెషల్ గిఫ్ట్
అయితే అదే రోజున తన ఇంట్లో చూసిన మరో అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడంటూ బాధితురాలు ఫిర్యాదులో వెల్లడించింది. ఇదే విషయంపై తాను నిలదీయడానికి వారి ఇంటికి వెళ్తే.. అతని కుటుంబం తనను తక్కువ చేసి మాట్లాడి గెంటేసరని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఫిర్యాదు చేయడంతో అతని కుటుంబం కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని బాధితురాలు ఆరోపించింది. సీనియర్ పోలీసు అధికారి జితేంద్ర కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ బాధితురాలి చేసిన ఆరోపణలు దరాప్తులో నిజమని తేలిందని అన్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడి కోసం వెతుకుతున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది.
Tags : marriage | lover | telugu-news not present in content
Also Read : AP Govt : వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఎంపీ అవినాష్ కు చంద్రబాబు సర్కార్ ఝలక్!