/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-36-3.jpg)
Apps
ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్లపై డీబీజీఐ ఉక్కుపాదం మోపింది. మొత్తం 357 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయడంతో పాటు గేమింగ్ సంస్థలకు చెందిన 2400 అకౌంట్లను ఫ్రీజ్ చేసింది. అలాగే గేమింగ్ కంపెనీలకు చెందిన రూ.1.26 కోట్లను డీబీజీఐ ఫ్రీజ్ చేసినట్లు తెలిపింది. ఈ ఆన్‌లైన్ గేమ్స్‌ను ఎవరూ వాడవద్దని అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
Dgca Cracks Down On Online Gaming Websites
— 4K Cinemas (@4kCinemass) March 22, 2025
Dgca Blocks 357 Gaming Websites
2400 Accounts Belonging To Gaming Companies And Rs. 126 Crore Frozen pic.twitter.com/mh6qggJrnl
ఇది కూడా చూడండి: నీ మొగుడ్ని వదిలేసి రా.. హైదరాబాద్ మహిళకు ఎన్ఆర్ఐ వేధింపులు
పలువురు సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా..
కొన్ని సంస్థలు వాటి పేర్లను నమోదు చేయకుండా జీఎస్టీ కట్టకుండా ఆదాయాలను దాచుతున్నాయి. ఇలాంటి ఆన్‌లైన్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై డీబీజీఐ చర్యలు తీసుకుంది. ఐటీశాఖ సమన్వయంతోనే మొత్తం 357 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటితో పాటు బెట్టింగ్‌లు, గ్యాంబ్లింగ్‌కు పాల్పడుతున్న 700 సంస్థలపై కూడా నిఘా ఉంచింది.
ఇది కూడా చూడండి: Betting App Case: ఎవ్వరినీ వదలకండి.. అందరిని జైల్లో వేయండి- పోలీసులకు మైనంపల్లి ఫిర్యాదు!
ఇలాంటి వారికి చెందిన 166 ఖాతాలను కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. అయితే వీటిలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో పాటు బాలీవుడ్‌కి చెందిన పలువురు సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా ఉన్నట్లు గుర్తించారు.