AP Man : అమెరికాలో ఆంక్షలు.. ఏపీ యువకుడు ఆత్మహత్య!
గుడివాడకు చెందిన కొల్లి అభిషేక్ అనే యువకుడికి ఏడాది క్రితమే పెళ్లి అయింది. అతడు భార్యతో కలిసి ఫీనిక్స్ లో నివసిస్తున్నాడు. అయితే ఆరు నెలల నుంచిఉద్యోగం లేకపోవడం.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆంక్షల మనస్థాపంతో కొల్లి అభిషేక్ ఆత్మహత్య పాల్పడ్డాడు.
అమెరికాలో ఏపీకి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుడివాడకు చెందిన కొల్లి అభిషేక్ అనే యువకుడికి ఏడాది క్రితమే పెళ్లి అయింది. అతడు భార్యతో కలిసి ఫీనిక్స్ లో నివసిస్తున్నాడు. అయితే ఆరు నెలల నుంచిఉద్యోగం లేకపోవడం.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆంక్షల మనస్థాపంతో కొల్లి అభిషేక్ ఆత్మహత్య పాల్పడ్డాడు.
మృతదేహాన్ని సొంతూరికి తరలించడానికి
అభిషేక్ ఆత్మహత్యతో గుడివాడలో ఉన్న అతడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి అంత్యక్రియల విరాళాలు చేపట్టిన సోదరుడి పోస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని సొంతూరికి తరలించడానికి దాతలు సాయానికి ముందుకు రావాలని గోఫండ్‌మీ ద్వారా ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే సోదరుడి మరణానికి కారణమని అరవింద్ తెలిపాడు.
Ganja: గంజాయి బ్యాచ్‌కు బిగ్ షాక్.. తాగినా, అమ్మినా పదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా!
గంజాయి బ్యాచ్‌కు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 2023 గుంతకల్లులో గంజాయితో పట్టుబడిన ఒడిశాకి చెందిన భగభాన్ పోలేకు అనంతరపురం కోర్టు పదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.
Ganja: గంజాయి బ్యాచ్‌కు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 2023 గుంతకల్లులో గంజాయితో పట్టుబడిన ఒడిశాకి చెందిన భగభాన్ పోలేకు అనంతరపురం కోర్టు పదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.
2023 కేసులో సంచలన తీర్పు..
ఈ మేరకు అనంతపురం మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి సత్యవాణి ఈ కేసును పరిశీలించి బుధవారం తీర్పును వెల్లడించారు. ఒడిశా కోడెల గ్రామానికి చెందిన భగభాన్ పోలే 2023 డిసెంబరు 18న 32 కిలోల గంజాయితో గుంతకల్లులో రైలు దిగాడు. స్టేషన్‌లో విశ్రాంత గదిలో ఉండగా రైల్వే పోలీసులు పట్టుకుని కేసు బుక్ చేశారు. కాగా ఈ కేసులో నేడు తుది తీర్పు వెలువడింది.
గంజాయి తాగించి అత్యాచారం..
ఇదిలా ఉంటే.. ఇటీవల వరంగల్ లో ఓ మైనర్ బాలికకు గంజాయి తాగించి అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. నగరంలో మైనర్ బాలికలను వ్యభిచార రొంపి (Prostitution) లోకి దింపుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచార ముఠాను నిర్వహిస్తున్న కీలక నిందితురాలు ముస్కు లతను అదుపులోకి తీసుకున్నారు. మైనర్ లతో వ్యభిచారం చేయిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని మైనర్ సెక్స్ రాకెట్ ఏర్పాటు చేసేందుకు ఓ యువతితో ప్లాన్ వేసిన ముఠా. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ (Instagram Account) సహాయంతో ఓ మైనర్ బాలికను ట్రాప్ చేసిన యువతి తన లవర్ తో కలిసి మైనర్ బాలికకు మద్యం, గంజాయికి అలవాటు చేసింది.
అంతే కాకుండా మైనర్ బాలికను నర్సంపేట తీసుకెళ్ళి గంజాయి తాగించి అత్యాచారానికి కూడా పాల్పడ్డారు. మార్చి 11న జరిగిన ఈ పాశవిక ఘటనను సీరియస్ గా తీసుకున్న వరంగల్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. మార్చి 11వ తేదీ వరంగల్ లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మైనర్ బాలిక మిస్సింగ్ కి సంబంధించి ఫిర్యాదు రాగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.