సోషల్ మీడియాలో బాయ్‌కాట్ 'అన్ అకాడమీ' ట్రెండ్.. అసలేంటి వివాదం?

ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ 'అన్‌అకాడమీ'ని బాయ్‌కాట్‌ చేయాలంటూ సోషల్‌మీడియాలో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు బీజేపీ సపోర్టర్స్‌. విద్యావంతులైన అభ్యర్థులకే ఎన్నికల్లో ఓటు వేయాలని అన్‌అకాడమీ ట్యూటర్‌ కరన్‌ సంగ్వాన్‌ చెప్పడం ఈ వివాదానికి కారణమైంది. కొత్తగా తీసుకొచ్చిన చట్టాలపై మాట్లాడుతూ కరన్‌ క్లాసు రూమ్‌లో ఈ వ్యాఖ్యలు చేయడం దుమారాన్ని రేపింది. ఇప్పటికే కరన్‌ని జాబ్‌ నుంచి తీసేసింది అన్‌అకాడమీ. అయినా కూడా ఈ గొడవ చల్లారేలాగా కనిపించడంలేదు. క్లాస్‌ రూమ్‌లో వ్యక్తిగత అభిప్రాయాలు రుద్దడం సరైనది కాదని పలువురు అభిప్రాయపడుతుండగా.. చదువుకున్న వాళ్లకి ఓటు వేయమనడం తప్పెలా అవుతుందని మరికొందరు అంటున్నారు.

New Update
సోషల్ మీడియాలో బాయ్‌కాట్ 'అన్ అకాడమీ' ట్రెండ్.. అసలేంటి వివాదం?

Unacademy Teacher's Remarks controversy: ప్రముఖ ఎడ్యు-టెక్‌ సంస్థ 'అన్‌అకాడమీ'(Unacademy)ని అన్‌ఇన్‌స్టాల్(Uninstall) చేయాలంటూ సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు కనిపిస్తున్నాయి. రైట్‌వింగ్‌, బీజేపీ మద్దతుదారులు ఈ ట్వీట్‌ క్యాంపెయిన్‌ చేస్తున్నారు. 'అన్‌అకాడమీ' క్లాసులు వినవద్దని ట్వీట్లు పెడుతున్నారు. ఈ ఎడ్యుకేషనల్‌ ఫ్లాట్‌ఫామ్‌ బీజేపీ నేతలను అవమానించేలాగా పని చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఇది రాజకీయ వర్గాల్లోనూ పెను దుమారాన్ని రేపుతోంది. 'అన్‌అకాడమీ' విషయంలో గ్రూపులుగా వీడిపోయి మరి లెఫ్ట్‌వింగ్‌, రైట్‌వింగ్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలు కొట్టుకుంటున్నారు.


అసలేం జరిగింది?
'అన్‌అకాడమీ'లో వందల సంఖ్యలో కోర్సులు ఉంటాయి. నిత్యం లక్షల్లో అన్‌అకాడమీలో క్లాసులు వింటారు. ముఖ్యంగా సివిల్స్‌తో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలుకు ప్రిపేర్ అయ్యేవాళ్లు ఆన్‌లైన్‌లో 'అన్‌అకాడమీ' క్లాసులపై ఆధారపడుతుంటారు. తాజాగా లోక్‌సభలో అమిత్‌షా ప్రవేశపెట్టిన బిల్లులపై క్లాస్‌ తీసుకున్నాడు ట్యూటర్‌ కరన్ సంగ్వాన్. ఈ క్రమంలోనే పేరు మార్పు వల్ల ఒరిగేదేమీ లేదని.. ఉన్న చట్టాలను పేర్లు మార్చి తీసుకురావడం వల్ల ఉపయెగం లేదన్నాడు కరన్‌. అంతేకాదు.. “ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఓటు వేసేటప్పుడు, చదువుకున్న అభ్యర్థిని ఎన్నుకోండి.. అప్పుడు మీరు జీవితంలో మళ్లీ ఇలాంటి బాధలు పడకుండా ఉంటారు.. పేర్లు మార్చడం మాత్రమే తెలిసిన వారికి ఓటు వేయకండి,” అంటూ కరన్‌ చెప్పడం వివాదానికి ప్రధాన కారణం.


తర్వాత ఏం జరిగింది?
కరన్‌ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో నిప్పు రాజేశాయి. చదువులేని వాళ్లకి ఓటు వేయకండి అని కరన్ చెప్పడం పరోక్షంగా బీజేపీ నేతలను టార్గెట్‌ చేసేలాగా ఉన్నాయని బీజేపీ కార్యకర్తలు 'అన్‌ఇన్‌స్టాల్‌ అన్‌అకాడమీ'(Uninstall Unacademy) అంటూ ట్వీట్లు మొదలుపెట్టారు. వివాదం పెద్దది అవుతుందని భావించిన అన్‌అకాడమీ వ్యవస్థాపకుడు రోమన్ సైనీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 'క్లాసు రూమ్‌ వ్యక్తిగత అభిప్రాయాలకు వేదిక కాదని.. టీచర్‌(కరన్‌) ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని' పోస్ట్ చేశారు. కరన్‌ని జాబ్‌ నుంచి తొలగించినట్టు క్లారిటీ ఇచ్చారు. అయినా బీజేపీ మద్దతుదారులు ఆగలేదు.. ఇప్పటికీ సోషల్‌మీడియాలో అన్‌అకాడమీకి వ్యతిరేకంగా ట్వీట్ల వర్షం కనిపిస్తోంది.


ఇంతకి బీజేపీ కార్యకర్తల వెర్షన్ ఏంటి?

➼ వ్యక్తిగత అభిప్రాయాలను ఎడ్యుకేషన్‌ ఫ్లాట్‌ఫామ్‌లో ఎలా బోధిస్తారు?

➼ కరన్‌ వ్యాఖ్యలు బీజేపీని టార్గెట్‌ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

➼ అమిత్‌షా, మోదీని తక్కువ చేసేలాగా అన్‌అకాడమీ ట్యూటర్‌ వ్యవహరించాడు.

➼ లక్షల మంది ఫాలోవర్లు ఉన్న 'అన్‌అకాడమీ'లో అభ్యర్థులపై రాజకీయ అభిప్రాయాల రుద్దడం ఏంటి?


యాంటి-బీజేపీ కార్యకర్తల వెర్షన్ ఏంటి?

➼ ఒక వ్యక్తి మాట్లాడిన దానికి మొత్తం 'అన్‌అకాడమీ'ని బాయ్‌కాట్‌ చేయాలని ఎలా చెబుతారు?

➼ చదువుకున్న వాళ్లకే ఓటు వేయమని చెప్పడంలో తప్పేంటి?

➼ వివాదానికి కారణమైన కరన్‌ని ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత కూడా ఈ ట్వీట్లు ఎందుకు?

➼ లక్షల మంది అభ్యర్థులున్న ఎడ్యుకేషనల్‌ ఫ్లాట్‌ఫామ్‌ని అన్‌ఇన్‌స్టాల్‌ చేయమని ప్రచారం చేయడం వల్ల నష్టపోయేది విద్యార్థులే కదా?


పొలిటికల్‌ డిబేట్:
ఇలా ఎవరీ వెర్షన్‌ని వారు వినిపిస్తూ సోషల్‌మీడియాలో రచ్చ చేస్తుండగా.. అటు రాజకీయ నాయకులు కూడా ఈ వివాదంపై స్పందిస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇప్పటికే కరన్‌ని ఉద్యోగం నుంచి తొలగించడాన్ని తప్పుబట్టారు. చదువుకున్న వాళ్లకే ఓటు వేయమని చెప్పడం ఎలా నేరం అవుతుందో తనకు అర్థంకావడం లేదన్నారు కేజ్రీవాల్.

Advertisment
Advertisment
తాజా కథనాలు