Mahbubabad District: వేధింపులు భరించలేక అటెండర్‌ ఆత్మాహత్య యత్నం

ప్రిన్సిపల్ వేధింపులు తాళలేక అంటేడర్‌ ఆత్మాహత్య యత్నం చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. సాంఘిక సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో స్వరూప అటెండర్‌గా విధులు నిర్వహిస్తుంది.

New Update
Mahbubabad District: వేధింపులు భరించలేక అటెండర్‌ ఆత్మాహత్య యత్నం

ప్రిన్సిపల్ వేధింపులు తాళలేక అంటేడర్‌ ఆత్మాహత్య యత్నం చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. సాంఘిక సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో స్వరూప అటెండర్‌గా విధులు నిర్వహిస్తుంది. ప్రిన్సిపల్‌ స్వరూపకు ఓవర్‌ డ్యూటీలు వేయడంతో పాటు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అంతే కాకుండా వివాహితకు ఆరోగ్యం బాగోలేకపోయినా విధులకు రావాలని, లేకుంటే తనను ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అటెండర్‌ పాఠశాలలోనే క్రిమి సంహారక ముందు తాగింది. దీనిని గమనించిన టీచర్లు ప్రిన్సిపల్‌కు విషయం తెలియజేయడంతో ప్రిన్సిపల్‌ ఈ విషయం బయట ఎవరికీ చెప్పవద్దని టీచింగ్‌ స్టాఫ్‌తో పాటు, విద్యార్థినులను బెదిరించాడు. అనంతరం స్వరూపను గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్‌ వాహనంలో తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం స్వరూప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు సాంఘీక సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలకు చేరుకున్న బాధితురాలి బంధువులు పాఠశాల ముందు ధర్నాకు దిగారు.

స్వరూప ఆత్మహత్య యత్నం చేసుకునేలా చేసిన ప్రిన్స్‌పాల్‌పై చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేశారు. మరోవైపు స్వరూప కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రిన్సిపల్‌ పరారీలో ఉన్నట్లు, అతని గురించి పాఠశాల సిబ్బంది, విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: నెలల తరబడి డబ్బు కూడబెట్టి కశ్మీర్ పర్యటన.. 9ఏళ్ల కొడుకు ముందే ప్రశాంత్ కలను కాలరాసిన ఉగ్రవాదులు!

పహల్గాం ఉగ్రదాడి ఒడిశాకు చెందిన ప్రశాంత్ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. నెలల తరబడి డబ్బు కూడబెట్టి ఫ్యామిలీతో కశ్మీర్ పర్యటన వెళ్లిన ప్రశాంత్‌ను 9ఏళ్ల కొడుకు, భార్యముందే కాల్చి చంపేశారు. అతని మరణ వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

New Update

Pahalgam Attack: మంగళవారం కశ్మీర్‌లోని బైసారన్‌లో జరిగిన ఉగ్రదాడి ఒడిశా బాలాసోర్‌కు చెందిన కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. 9 ఏళ్ల కొడుకు, భార్య ముందే 41 ఏళ్ల ప్రశాంత్ సత్పతిని దారుణంగా కాల్చి చంపారు. అతని మరణ వార్త వినగానే తల్లి షాక్‌తో సృహతప్పి పడిపోగా గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక తాము రోప్‌వే నుంచి దిగుతుండగా ఉగ్రవాదులు ఆయన తలపై కాల్చి చంపారని ప్రశాత్ భార్య ప్రియదర్శిని ఆచార్య తెలిపింది. ప్రశాంత్ అక్కడికక్కడే పడిపోయాగా ఈ సంఘటన జరిగిన ఒక గంట తర్వాత సైన్యం వచ్చిందని చెప్పింది. ప్రశాంత్ మరణ వార్త గ్రామ తూర్పు ప్రాంతానికి చేరుకోగానే అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయని,  ఈ షాక్ కారణంగా అతని తల్లి ఏమీ మాట్లాడలేకపోతున్నట్లు కన్నీరు పెట్టుకున్నారు. 

నెలల తరబడి డబ్బు దాచుకుని..

ప్రశాంత్ బాలాసోర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (CIPET)లో అకౌంట్స్ అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. అయితే ఈ కశ్మీర్ పర్యటన కోసం అతను నెలల తరబడి డబ్బు దాచుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సెలవులు పెట్టి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి తమను తీసుకొచ్చాడని ప్రియదర్శిని తెలిపింది. బుధవారం రాత్రి మృతదేహాన్ని భువనేశ్వర్‌కు తీసుకురానుండగా.. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సూచనల మేరకు ఢిల్లీలో ఉన్న ఒడిశా రెసిడెంట్ కమిషనర్ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. గురువారం అంత్యక్రియలు జరుగనున్నాయి. దీనిలో ప్రభుత్వ ప్రతినిధులు కూడా పాల్గొంటారని, బాధిత కుటుంబాన్ని ఓదారుస్తున్నట్లు భువనేశ్వర్ ఎంపీపీ అపరాజిత సారంగి తెలిపారు. కాంగ్రెస్, హిందూ జాగరణ్ మంచ్ ఈ దాడిని ఖండించి నివాళులర్పించాయి. 

Also Read: Pahalgam Terror Attack-Tollywood: క్షమించరాని క్రూరమైన చర్య..ఉగ్రదాడిని ఖండించిన సినీ ప్రముఖులు!

మరోవైపు ఉగ్రవాదుల దాడిని అడ్డుకునేందుకు హీరోలా ముందుకొచ్చి మరణించిన హార్స్‌రైడర్ సయీద్‌ అదిల్ హుస్సేన్‌ షాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పర్యటకులపై దాడికి  పాల్పడుతుంటే అడ్డుకున్నాడు. ఉగ్రమూకల నుంచి తుపాకులు  లాగేసుకునేందుకు ప్రయత్నించి, చివరికి వీరుడిలా ప్రాణాలు విడిచాడు. ఇక హుస్సేన్ మృతిపై స్పందించిన పేరెంట్స్.. ‘పనికోసం మా కొడుకు పహల్గాం వెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటలకు దాడి జరిగినట్లు తెలిసింది. మేము వెంటనే ఫోన్ చేశాం కానీ కలవలేదు. స్విచ్ఛాఫ్ వచ్చింది. సాయంత్రం 4.40 గంటల సమయంలో ఫోన్ రింగ్ అయింది కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు.  పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేయగా ఉగ్రదాడిలో మా బిడ్డకు గాయలైనట్లు చెప్పారు’ అని హుస్సేన్ తండ్రి సయ్యద్ హైదర్ షా చెప్పారు. కానీ చివరకు హుస్సేన్ మరణవార్త తెలిసి గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. 

Also read : ALH Dhruv choppers : ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!

pehalgam terror attack | odisha | family | telugu-news today telugu news

Advertisment
Advertisment
Advertisment