UK : యూకేలో తిప్పలు పడుతున్న ఇండియన్‌ స్టూడెంట్స్.. కారణం ఏంటంటే!

బ్రిటన్ దేశాన్ని ఆర్థిక మాంద్యం ఇబ్బంది పెడుతుంది. గతేడాది ఆ దేశ జీడీపీ 0.3 శాతానికి క్షీణించడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యం బారిన పడటం జరుగుతుంది. ఇదే భవిష్యత్తులో కూడా జరిగితే మాత్రం అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలుస్తుంది.

New Update
UK : యూకేలో తిప్పలు పడుతున్న ఇండియన్‌ స్టూడెంట్స్.. కారణం ఏంటంటే!

Britain : బ్రిటన్ దేశాన్ని ఆర్థిక మాంద్యం ఇబ్బంది పెడుతుంది. గతేడాది ఆ దేశ జీడీపీ 0.3 శాతానికి క్షీణించడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా మాంద్యం బారిన పడటం జరుగుతుంది. ఇదే భవిష్యత్తులో కూడా జరిగితే మాత్రం అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు(Indian Students) తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలుస్తుంది.

ఈ ఆర్థిక మాంద్యం ప్రభావం ఉద్యోగాల(Jobs) మీద కూడా ఉంటుందని అక్కడ ఉన్న భారతీయులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఉద్యోగాలు రాకుండా పోస్టు స్టడీ వీసాలు(Post Study Visa) అయిపోతాయని కొందరు విద్యార్థులు భయపడుతున్నారు. దీంతో అక్కడ ఉండాలంటే ఖర్చులు కూడా పెరిగిపోతాయి. దీంతో అక్కడే ఉండి ఇబ్బందులు పడటం కంటే.. స్వదేశానికి తిరిగి వచ్చేయడమే మేలని కొందరు భావిస్తున్నారు.

దీంతో జాబ్‌ మార్కెట్‌ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుంది. కొందరు విద్యార్థులు అయితే స్పాన్సర్‌ షిప్‌ వీసా(Sponsorship Visa) మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్‌ చూపించడం లేదు. విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇస్తామని మాట ఇచ్చిన బ్రిటన్ ప్రభుత్వం మాట తప్పిందని విమర్శలు వస్తున్నాయి.

Also Read : రేవంత్ రెడ్డి ఇంటిపై నిఘా.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నివ్వెరపోయే నిజాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు