UGC-NET: యూజీసీ నెట్ ఎగ్జామ్ కొత్త షెడ్యూల్ ఇదే..

పరీక్ష జరిగిన ఒకరోజు తర్వాత రద్దు అయిన యూజీసీ నెట్ ఎగ్జామ్ కొత్త షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది ఎన్టీయే. ఆగస్టు 21, సెప్టెంబర్ 4 ల మధ్యలో జరుగుతుందని ప్రకటించింది. అలాగే సీఎస్ఐఆర్టీ ఎగ్జామ్ జులై 25, 27 మధ్యన నిర్వహించనున్నారు. 

New Update
UGC-NET: యూజీసీ నెట్ ఎగ్జామ్ కొత్త షెడ్యూల్ ఇదే..

యూజీసీ నెట్, సీఎస్‌ఐఆర్టీ పరీక్షల కొత్త తేదీలను అనౌన్స్ చేసింది ఎన్టీయే. యూజీసీ నెట్ పరీక్ష అయిన ఒకరోజు తర్వాత రద్దు అయితే..సీఎస్ఐఆర్టీ ఎగ్జామ్‌ మాత్రం ముందుగానే కాన్సిల్ అయింది. ఈరెండింటిని మళ్ళీ నిర్వహిస్తామని చెప్పిన ఎన్టీయే ఈరోజ కొత్త తేదీలను ప్రకటించింది. వాటి ప్రకారం యూజీసీ నెట్ ఆగస్టు 21, సెప్టెంబర్ 4 ల మధ్యలో జరుగుతుందని తెలిపింది. మరోవైపు సీఎస్ఐఆర్టీ ఎగ్జామ్ జులై 25, 27 మధ్యన నిర్వహించనున్నారు. ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఇండియా అయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మాత్రం ఇంతకు ముందు పరకించిన తేదీల ప్రకారమే జులై 6 జరగనుంది.

నీట్, నెట్ పేపర్లు లీక్ చర్చీయాంశంగా మారింది. దీంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మీద నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఎన్‌టీఏ నిర్మాణం, పనితీరు, పారదర్శకతను పరిశీలించేందుకు హైలెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. డార్క్ వెబ్‌లో పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడం ఆందోళనకరమని అన్నారు. దేశ వ్యాప్తంగా దీని మీద నిరనలుకూడా వెల్లువెత్తాయి. విద్యార్ధి సంఘలు ఆందోళనలు నిర్వహించాయి. దీంతో ఈ వ్యవహరం మీద సీబీఐ విచారణ ప్రారభించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

Also Read:Andhra Pradesh: విద్యార్ధులకు సర్టిఫికేట్లు..మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు