UCC : యూనిఫాం సివిల్‌ కోడ్‌ కేవలం కేంద్రమే కాదు..రాష్ట్రాల వారీగా అమలు చేయోచ్చు!

పార్లమెంట్ ద్వారా యూనిఫాం సివిల్ కోడ్‌ కి సంబంధించిన ఏ చట్టాన్ని కూడా ముందుకు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా లేదని... కేంద్రం కంటే రాష్ట్రాలే ఈ చట్టాన్ని ముందుగా తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు మొగ్గు చూపుతున్నాయని బీజేపీ ఉన్నత వర్గాలు తెలిపాయి.

New Update
UCC : యూనిఫాం సివిల్‌ కోడ్‌ కేవలం కేంద్రమే కాదు..రాష్ట్రాల వారీగా అమలు చేయోచ్చు!

Uniform Civil Code : పార్లమెంట్ ద్వారా యూనిఫాం సివిల్ కోడ్‌ (UCC) కి సంబంధించిన ఏ చట్టాన్ని కూడా ముందుకు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం (Central Government) సిద్దంగా లేదని... కేంద్రం కంటే రాష్ట్రాలే ఈ చట్టాన్ని ముందుగా తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు మొగ్గు చూపుతున్నాయని బీజేపీ ఉన్నత వర్గాలు తెలిపాయి.

ఉత్తరాఖండ్‌ (Uttarakhand) తరువాత బీజేపీ (BJP) పాలిత రాష్ట్రాలు త్వరలో దీనిని అమలులోనికి తీసుకుని వస్తాయని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేసింది. గుజరాత్‌, అస్సాం వంటి రాష్ట్రాలు ఇప్పటికే యూసీసీ చట్టాలను ఆమోదించే ప్రక్రియలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో, బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ యూసీసీ బిల్లును ఆమోదించింది. అన్ని మతాలకు సంబంధించిన వివాహం, విడాకులు, వారసత్వం కోసం సాధారణ చట్టాలను కలిగి ఉన్న యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేసిన భారతదేశపు మొదటి రాష్ట్రంగా నిలిచింది. ఇదిలా ఉండగా, ఈ సమస్యపై లా కమిషన్ ఫైనల్‌ నిర్ణయం కోసం ఎదురు చూస్తామని న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుక్రవారం చెప్పారు.

Also read: రాజ్‌తరుణ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. ఆత్మహత్యయత్నం చేసిన లావణ్య!

Advertisment
Advertisment
తాజా కథనాలు