AP: ముచ్చుమర్రి ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఇద్దరు పోలీస్ అధికారులు సస్పెండ్..!

కర్నూలు జిల్లా ముచ్చుమర్రి ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు వేసింది. నందికొట్కూరు రూరల్ సీఐ విజయ్‌భాస్కర్, ముచ్చుమర్రి ఎస్‌ఐ జయశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ కర్నూలు రేంజ్‌ డీఐజీ విజయరావు ఉత్తర్వులు జారీ చేశారు.

New Update
AP: ముచ్చుమర్రి ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఇద్దరు పోలీస్ అధికారులు సస్పెండ్..!

Muchumarri SI & CI Suspended: ఏపీలో సంచలనం సృష్టించిన ముచ్చుమర్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు వేసింది. నందికొట్కూరు రూరల్ సీఐ విజయ్‌భాస్కర్ (CI Vijaybhaskar), ముచ్చుమర్రి ఎస్‌ఐ జయశేఖర్‌ను (SI Jayasekhar) సస్పెండ్ చేస్తూ కర్నూలు రేంజ్‌ డీఐజీ విజయరావు ఉత్తర్వులు జారీ చేశారు.

నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు హత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే, వారం రోజులు గడుస్తున్న బాలిక మృతదేహం ఇంకా దొరక లేదు. ఈ కారణంగా విధుల్లో నిర్లక్ష్యం, క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించారని కర్నూలు రేంజ్‌ డీఐజీ చర్యలు తీసుకున్నారు. డీఐజీ మాట్లాడుతూ.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Also Read: కుక్కల దాడికి బాలుడు బలి.. సీఎం కీలక ఆదేశాలు.. వీధికుక్కల దాడిపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్‌..!

Advertisment
Advertisment
తాజా కథనాలు