rain: తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం కారణంగా మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు కూడా వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. By Vijaya Nimma 20 Aug 2023 in తెలంగాణ వాతావరణం New Update షేర్ చేయండి మరో రెండు రోజులు వానలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినందున తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేశా వేశారు. ఈ మేరకు జిల్లా అధికారులు పలు హెచ్చరికలను జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా మ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు వర్ష సూచన చేసింది. తెలంగాణలో వర్షాలు మొదలై దాదాపు మూడు నెలలు అయింది. అన్నదాతలపరంగా చూస్తే అవసరమైన సమయానికి వానలు పడకపోవడంతో రైతులు పంటలకు కొంత ఇబ్బందికరంగా ఉంది. ఆగస్టు నెలలో వానలు పూర్తిగా పడే పరిస్థితులు కనిపించడం లేదు. వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉరుముల, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. అల్పపీడన ప్రభావం ఇవాళ ఛత్తీసఢ్ పరిసర ప్రాంతాల్లో బంగాళాఖాతంలోని అల్పపీడనం కొనసాగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ అల్పపీడినం పశ్చిమ వాయువ్యం దిశగా కదులుతూ మరో 24 గంటల్లో మధ్య ఈశాన్య మధ్యప్రదేశ్ మీదుగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. అల్పపీడన ప్రభావంతో మరో మూడు రోజులు పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి. నేడు కామారెడ్డి, పెద్దపల్లి, ములుగు, సంగారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి అదిలాబాద్‌లో ఎడతెరిపి లేకుండా ఇప్పటికే వర్షం కురుస్తోంది. మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో స్వర్ణ, గడ్డన్న వాగు ప్రాజెక్ల నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. పలు సూచనలు జారీ ఇక ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే కోస్తా జిల్లాలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అన్ని జిల్లాలకు ఏపీ ప్రభుత్వం పలు సూచనలు జారీ చేసింది. శ్రీకాకుళం, అల్లూరి, గుంటూరు, బాపట్ల, ఏలూరు, కృష్ణాజిల్లాలలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. #telangana #yellow-alert-issued #two-daysrain మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి