Musk Vs Centre: మేం అంగీకరించడంలేదు.. కేంద్ర ఉత్తర్వులపై ఎలాన్ మస్క్ కంపెనీ ఆగ్రహం! సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌కి కేంద్రానికి మధ్య మరోసారి వార్ మొదలైనట్టే కనిపిస్తోంది. వివాదాస్పద అకౌంట్లను సస్పెండ్ చేయాలన్న కేంద్రం ఆదేశాలకు ట్విట్టర్ స్పందించింది. సంబంధిత అకౌంట్లను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నామని.. అయితే కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసింది. By Trinath 22 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Twitter Reacts To Centre Orders: ట్విట్టర్‌లో కొన్ని ఖాతాలను బ్లాక్ చేయాలని కేంద్రం ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. నిర్దిష్ట అకౌంట్లు, కొన్ని పోస్ట్‌లపై చర్యలు తీసుకోవాలని కేంద్రం ట్విట్టర్‌ను కోరింది. భారత ప్రభుత్వ కోరిక మేరకు ట్విట్టర్ కొన్ని ఖాతాలను బ్లాక్ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో మస్క్ కంపెనీ ఏకీభవించడం లేదు. ప్రజలకు వాక్ స్వాతంత్య్రం ఉండాలని మరోసారి స్పష్టం చేసింది. ఈ సమాచారాన్ని గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ బృందం ఒక పోస్ట్ ద్వారా వివరించింది. ట్విట్టర్ వ్యాఖ్యలపై కేంద్రం ఇంకా స్పందించలేదు. The Indian government has issued executive orders requiring X to act on specific accounts and posts, subject to potential penalties including significant fines and imprisonment. In compliance with the orders, we will withhold these accounts and posts in India alone; however,… — Global Government Affairs (@GlobalAffairs) February 21, 2024 ఇది తొలిసారి కాదు: సామాజిక, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్న వివాదాస్పద అకౌంట్లు, కాంట్రవర్శియల్ పోస్టులను బ్లాక్ చేయమని భారత ప్రభుత్వం కోరుతోంది. కేంద్ర ఉత్తర్వును అనుసరించి అకౌంట్లను బ్లాక్ చేయడంపై ట్విట్టర్ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై ట్విట్టర్ వ్యతిరేకత వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు 2021లో కూడా ట్విట్టర్ ఇదే వైఖరిని చూపించింది. ప్రభుత్వ ఉత్తర్వులు భావప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమని వాదించింది. ఎలాన్ మస్క్ భావ ప్రకటనా స్వేచ్ఛకు ఎక్కువగా ప్రియారిటీ ఇస్తారు. ట్విట్టర్‌లో స్వేచ్ఛగా మాట్లాడేందుకు, రాసేందుకు అందరికీ సమాన అవకాశం కల్పిస్తారని ట్విట్టర్ చెబుతుంటుంది. పాటించాల్సిందేనంటున్న కేంద్రం: గతేడాది జూన్‌లో నిర్దిష్ట సోషల్ మీడియా ఖాతాలు, ట్వీట్‌లను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా ట్విట్టర్ చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. భారత ప్రభుత్వ ఆదేశాలను పాటించనందుకు కంపెనీకి హైకోర్టు రూ.50 లక్షల జరిమానా కూడా విధించింది. దేశ చట్టాలను సోషల్‌మీడియా కంపెనీలు తప్పక పాటించాలని కేంద్రం స్పష్టం చేస్తోంది. Also Read: అరే ఏంట్రా ఇదీ.. మళ్ళీనా! డ్రగ్స్ కేసులో షణ్ముఖ్ అరెస్ట్! ALSO WATCH: #elon-musk #twitter మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి