TTD : నిరుద్యోగులకు టీటీడీ గుడ్ న్యూస్..భారీగా ఉద్యోగాలు..వెంటనే అప్లై చేసేయండి! టీటీడీలో భారీ స్థాయిలో జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 78 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 49 డిగ్రీ లెక్చరర్ పోస్టులు, 29 జూనియర్ లెక్చరర్ పోస్టులుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. By Bhavana 06 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Tirumala Tirupati Devasthanam : ఏపీ(AP) లోని నిరుద్యోగులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. టీటీడీ(TTD) లో భారీ స్థాయిలో ఉద్యోగాలను(Jobs) పూరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. టీటీడీ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 78 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 49 డిగ్రీ లెక్చరర్ పోస్టులు, 29 జూనియర్ లెక్చరర్ పోస్టులుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు గురించి తెలుసుకుందాం. ఈ ఉద్యోగాలు కావాలి అనుకున్న వారు, ఆసక్తి ఉన్న వారు , అప్లై చేయాలనుకునేవారు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో చూసుకోవాలి. ఈ ఉద్యోగాలకు అప్లై(Apply Jobs) చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 25 గా అధికారులు ప్రకటించారు. పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. జూనియర్ లెక్చరర్ పోస్టులు(Jr. Lecturers Posts) మొత్తం.. 29. సబ్జెకుల వారీగా జేఎల్ ఖాళీలు.. హిస్టరీ -4, సివిక్స్-4, కెమిస్ట్రీ-4, బోటనీ-4, తెలుగు-3, కామర్స్-2, ఫిజిక్స్ -2, జువాలజీ-2, ఇంగ్లీష్-1, హిందీ-1, మ్యాథ్స్ -2 పోస్టులకు ఖాళీలు ఉన్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారికి మాస్టర్స్ డిగ్రీ కనీసం 55 శాతం మార్కులతో పాసై ఉండాలి. అప్లై చేసుకునే వారి వయసు జులై 1 2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్యలో ఉండాలి. జూనియర్ లెక్చరర్ పోస్టులకు రూ. 57 ,100 నుంచి రూ. 1, 47,760 వరకు ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్, డాక్యుమెంట్స్ వేరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ. 250, ఇతరులకు రూ. 370 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అప్లై చేసుకునే వారు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని గురించి టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో చూడాలని అధికారులు తెలిపారు. Also Read : జూనియర్ ఎన్టీఆర్ గురించి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు! #ttd #jobs #notification #jr-lecturer-posts మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి