TTD: టీటీడీ ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు.. పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలను తీసుకుంది. టీటీడీలో ప్రతి ఉద్యోగికి ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు..కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్లో అర్హత ఉన్నవారిని రెగ్యూలరైజ్‌ చేస్తున్నట్లు సమావేశంలో నిర్ణయించినట్లు చైర్మన్‌ భూమన తెలిపారు.

New Update
TTD : టీటీడీ ఛైర్మన్‌ పదవికి భూమన రాజీనామా!

టీటీడీ (TTD)పాలక మండలి సమావేశం మంగళవారం నాడు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి (Bhumana Karunakar reddy) వెల్లడించారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యూలరైజ్‌ చేయాలనే ప్రభుత్వ జీవో నెం. 114 మేరకు అర్హత ఉన్న ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

టీటీడీలో ప్రతి ఒక్క ఉద్యోగికి ఇంటి స్థలాలు కేటాయిస్తామని , ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించిన వడమాలపేట వద్ద గ్రావెల్‌ రోడ్డు నిర్మాణానికి రూ. 25. 67 కోట్లు కేటాయిస్తున్నట్లు భూమన తెలిపారు. వీటిని తిరిగి ఉద్యోగులు నుంచి రీ ఎంబర్స్‌ చేసుకుంటామని అన్నారు.
శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని అలిపిరి వద్ద 23వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని ఆయన వివరించారు. ఈ హోమంలో పాల్గొనాలనుకునే భక్తులు వెయ్యి రూపాయలు చెల్లించి టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుందని భూమన వివరించారు.

తిరుపతిలోని రామ్‌ నగర్‌ క్వార్టర్స్‌ అభివృద్ధి పనులకు రూ.6.15 కోట్లు కేటాయిస్తున్నట్లు భూమన తెలిపారు. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా రూ. 14 వేలు ఇస్తున్నట్లు ఛైర్మన్‌ తెలిపారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు రూ. 6,850 చెల్లిస్తామని భూమన వివరించారు. త్వరలోనే రూ.197 కోట్లతో స్విమ్స్‌ ఆసుపత్రి ఆధునీకరణ పనులు చేయాలని పాలక మండలి నిర్ణయించినట్లు భూమన వివరించారు.

అలాగే ప్రసాదాలు, ముడి సరుకులు నిల్వ చేయడానికి అలిపిరి వద్ద రూ.11 కోట్లతో గోడౌన్లు నిర్మాణం చేస్తున్నట్లు పేర్కొన్నారు, మంగళం నుంచి రేణిగుంట వరకు రోడ్డు అభివృద్ది పనులకు రూ. 15 కోట్లు, యంఆర్‌పల్లి జంక్షన్‌ నుంచి అన్నమయ్య వరకు రోడ్డు అభివృద్ది పనులకు రూ.4.5 కోట్లు , పుదిపట్ల జంక్షన్‌ నుంచి వకుళామాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణంకు రూ.21 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.

స్విమ్స్‌ లో రూ. 3.35 కోట్ల తో నూతన భవనాలు నిర్మాణం..స్విమ్స్‌ లో నూతన కార్డియో, న్యూరో బ్లాక్‌ ల ఏర్పాటుకు రూ.74 కోట్లు కేటాయించినట్లు టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి తెలిపారు. ఆయుర్వేద హాస్పిటల్ లో 1.65 కోట్లతో నూతన భవనం నిర్మాణం. రుయాలో టీబీ రోగులకోసం 1.79 కోట్లతో నూతన వార్డు నిర్మాణం. ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. టీటీడీలో అర్హత ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యూలరైజ్ చేస్తామని అన్నారు. ప్రభుత్వ ఉత్వర్వులు మేరకు కాంట్రాక్ట్, కార్పొరేషన్ పరిధిలోఉన్న ఉద్యోగులను అర్హత మేరకు రెగ్యూలరైజ్ చేస్తామని చెప్పారు.

Also read: భార్యకు విడాకులు ఇచ్చిన రేమండ్స్ ఓనర్ సింఘానియా.. కారణమిదే?

Advertisment
Advertisment
తాజా కథనాలు