Medaram Jatara: రూ.299 చెల్లిస్తే మేడారం ప్రసాదం ఇంటికి! మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు టీఎస్ఆర్‌టీసీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 14 నుంచి 25 వరకు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తులకు అందించనుంది. రూ.299 చెల్లించి కార్గో కౌంటర్లలో బుకింగ్ చేసుకోవాలని సూచించింది. By srinivas 20 Feb 2024 in బిజినెస్ తెలంగాణ New Update షేర్ చేయండి Medaram Jatara Prasadam: తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) శుభవార్త చెప్పింది. ఇంటికే మేడారం సమ్మక్క, సారలమ్మ ప్రసాదం చేరవేస్తామని తెలిపింది. గతంలో మాదిరి ఈసారి సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చే సేవలను (Home Delivery) అందిస్తోంది. ఈ మేరకు దేవాదాయ శాఖతో టీఎస్ఆర్‌టీసీ లాజిస్టిక్స్ (TSRTC Logistics) విభాగం ఒప్పందం కుదుర్చుకుంది. అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తులకు అందజేయనున్నారు. ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో బుకింగ్.. మేడారం మహా జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనుండగా.. ఈ నెల 14 నుంచి 25 వరకు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో అమ్మవార్ల ప్రసాదం కోసం భక్తులు బుకింగ్ చేసుకోవచ్చు. అందుకోసం భక్తులు రూ.299 చెల్లించాలి. సమీపంలోని టీఎస్ఆర్‌టీసీ లాజిస్టిక్స్(కార్గో) కౌంటర్లలో, పీసీసీ ఏజెంట్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ల వద్ద ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. పేటీఎం ఇన్‌సైడర్ యాప్ ద్వారానూ అమ్మవార్ల ప్రసాదాన్ని పొందవచ్చు. ఆన్‌లైన్ బుకింగ్ సమయంలో భక్తులు తమ చిరునామా, పిన్ కోడ్, ఫోన్ నంబర్ వివరాలు తప్పనిసరిగా నమోదుచేయాలి. మరిన్ని పూర్తి వివరాలకు టీఎస్ఆర్‌టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040-69440069, 040-69440000, 040-23450033ను సంప్రదించవచ్చు. ఇది కూడా చదవండి : Hyderabad: డ్యూలింగ్ ఎగ్జామ్ లో మాల్ ప్రాక్టీస్.. ఏడుగురు అరెస్ట్ భక్తులంతా మాకు వీఐపీలే.. మేడారం జాతరకు వచ్చే భక్తులందరూ తమకు వీఐపీలేనని, ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న జాతర కోసం అన్ని సౌలతులు కల్పించామని రెవెన్యూ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy) చెప్పారు. గతంలో మేడారం మహాజాతరకు పనిచేసిన అనుభవం ఉన్న ఆఫీసర్లకే డ్యూటీలు వేశామని చెప్పారు. మేడారం మహాజాతర ఏర్పాట్లపై ఆఫీసర్లతో ఆయన రివ్యూ చేశారు. అంతకుముందు మేడారంలో రూ.10 లక్షలతో నిర్మించిన మీడియా సెంటర్‌ను మంత్రి సీతక్కతో కలిసి ఆయన ప్రారంభించారు. ఇప్పటికే దాదాపు 60 లక్షల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నారని చెప్పారు. నాలుగు రోజుల మహాజాతరలో రెండు కోట్ల మంది భక్తులు మేడారం రానున్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. మేడారం మహా జాతరకు వెళ్లలేకపోతున్నారా..!? అయితే మీకో శుభవార్త. శ్రీ సమ్మక్క సారలమ్మ ప్రసాదాన్ని ఆన్‌లైన్/ఆఫ్ లైన్ లో బుక్ చేసుకుంటే మీ ఇంటికి పంపించే సదావకాశాన్ని కల్పిస్తోంది #TSRTC. మరింకెందుకు ఆలస్యం.. ఇప్పుడే మేడారం ప్రసాదానికి ఆర్డర్ ఇవ్వండి. తల్లుల అనుగ్రహాన్ని పొందండి.… pic.twitter.com/qv1buMQyPN — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) February 19, 2024 6 వేల ఆర్టీసీ బస్సులు.. అలాగే మేడారం వచ్చే భక్తులకు రవాణాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్రం నలుమూలల నుంచి 6 వేల ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని చెప్పారు. మహాజాతరకు రెండు నెలలు ముందు నుంచే మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ముందస్తు దర్శనానికి ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ఇదే ప్రథమమని ఆమె తెలిపారు. ఇది రాష్ట్ర పండుగ అని జాతర విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు. మేడారంలో శాశ్వత పనులు చేపడతామని చెప్పారు. తల్లుల కీర్తి ప్రతిష్టలు శిలాశాసనం చేసి చరిత్ర లికించేందుకు కృషి చేస్తామన్నారు. #tsrtc #medaram-prasadam #medaram-jatara-prasadam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి