Hyderabad: ‘రెరా’ కార్యదర్శి బాలకృష్ణ అరెస్టు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు

హెచ్‌ఎండీఏ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై ఆదాయానికి మించిన ఆస్థుల కేసు నమోదు కావడంతో గురువారం తెల్లవారుజామున పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. తన పదవిని ఆసరగా చేసుకుని వందల కోట్లు అక్రమంగా సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

New Update
Hyderabad: ‘రెరా’ కార్యదర్శి బాలకృష్ణ అరెస్టు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు

Siva Balakrishna Arrested: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కార్యదర్శి, హెచ్‌ఎండీఏ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం మాజీ డైరెక్టర్ (HMDA EX Director) శివబాలకృష్ణ ఇంట్లో బుధవారం ఉదయం నుంచి అవినీతి నిరోధక శాఖ సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గురవారం తెల్లవారుజామున 3 గంటలకు ఏసీబీ (ACB) అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు. బుధవారం నిర్వహించిన సోదాల్లో బాలకృష్ణకు సంబంధించి రూ.100 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి.

పదవిని ఆసరగా చేసుకొని

అయితే బాలకృష్ణ గతంలో HMDA ప్రణాళిక విభాగం డైరెక్టర్‌గా ఉంటూనే.. మరోవైపు ఎంఏయూడీ (పురపాలన, పట్టణాభివృద్ధి విభాగం)లో ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. హెచ్‌ఎంఏ నుంచి దస్త్రాలను ఆయనే పంపించేవారు. ఎంఏయూడీలో డైరెక్టర్ కూడా ఆయనే కాబట్టి వాటికి జీవోలిచ్చేవారు. ఈయన మేడ్చల్, మెదక్, రంగారెడ్డి, భువనగిరి, సంగారెడ్డి.. తదితర 7 జిల్లాలోని భూములకు సంబంధించిన అనుమతుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. HMDA పరిధి జోన్లలో ఉన్న రూల్స్‌ను ఆసరగా చేసుకొని వందల దరఖాస్తులకు ఆమోదముద్ర వేసేందుకు భారీగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.

Also read:  మీరు పోలీసులేనా!.. విద్యార్థిపై అమానుష దాడి హేయమైన చర్య.. ట్విట్టర్‌లో మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత

దస్త్రాలకు అనుమతులిస్తూ డబ్బులు దోచుకున్నాడు

ఒక్కో అంతస్తుకు రూ.4 లక్షల వరకు.. అలాగే లేఅవుట్లలో ఒక్కో ఎకరానికి రూ.లక్షల్లో వసూళ్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. అంతేకాదు నెలకు 70 - 80 దస్త్రాలకు అనుమతులు మంజూరు చేస్తు డబ్బులు దండుకున్నారని బాలకృష్ణపై (Siva Balakrishna) ఆరోపణలున్నాయి. అయితే బాలకృష్ణ నుంచి రూ. 40 లక్షల నగదు, 5 కోట్ల విలువైన బంగారాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. భారీగా స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 70ఎకరాల భూమి, ఇండ్లు ,60 ఖరీదైన చేతి గడియారాలు, 100 మొబైల్ ఫోన్లు, నాలుగు కార్లు, 10 ల్యాప్ టాప్స్ ఉన్నట్లు గుర్తించారు.

రూ.500 కోట్ల అక్రమాస్తులు ?

అంతేకాదు తన పదవిని, ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారితో సన్నిహిత పరిచయాన్ని అడ్డుపెట్టుకుని.. ఏకంగా రూ.500 కోట్ల వరకు అక్రమ ఆస్తులు సంపాదించినట్లు ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో శివబాలకృష్ణపై ఆదాయానికి మించిన ఆస్థుల కేసు నమోదు చేసి.. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు (Banjara Hills Police Station) తరలించారు. అయితే ఈరోజు (గురువారం) ఆయన్ని కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి.

Also read:  5 ఏళ్ల చిన్నారిని చంపేసిన మూఢ నమ్మకం.. కన్నకొడుకుకే నీటిలో ముంచి హతమర్చిన తల్లిదండ్రులు!

ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర ఏం చెప్పారంటే

  • శివ బాలకృష్ణ ఇంట్లో సోదాలు ముగిశాయి
  • ఆయన గతంలో HMDA మాజీ ప్లానింగ్ డైరెక్టర్... ప్రస్తుతం మెట్రో రైల్ ప్లానింగ్ ఆఫీసర్ , రెరా సెక్రటరీ గా పని చేస్తున్నారుఆదాయానికి మించిన         ఆస్తులు ఉన్నట్లు గుర్తించాం
  • సమీప బంధువులు , ఆయన స్నేహితులు , కొలీగ్స్ ఇండ్లల్లో 17 ప్రదేశాల్లో సోదాలు జరిగాయి
  • ఆయన ఇంట్లో 84 లక్షల 60 వేలు నగదు , 2 కేజీలు బంగారం , 5.5 కేజీలు వెండి , 32 లక్షలు విలువ చేసే వాచ్‌లు , 3 విల్లాలు , 3 ఫ్లాట్స్ , 90 ఏకరాల      భూమి గుర్తించాం
  • భూమి ఆయన పేరుతో పాటు బినామీల పేరుపై ఉన్నట్లు గుర్తించాం
  • మార్కెట్ విలువ ప్రకారం భూముల విలువ సుమారు 60 కోట్లు ఉంటుంది
  • మొత్తం ప్రాపర్టీస్ విలువ రూ.75 కోట్లు ఉంటుంది
  • ఈ సోదాలు ఇంకో నాలుగు చోట్ల కొనసాగుతున్నాయి
  • కొన్ని విషయాలు ఆయన చెప్పలేదు... మా విచారణకు సహకరించలేదు
  •  కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది.
Advertisment
Advertisment
తాజా కథనాలు