Telangana : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాల భర్తీపై టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం? రాష్ట్రంలో ఉన్న 9 వేల గ్రూప్-4 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు 1:3 నిష్పత్తి ఫార్ములాను అమలు చేయనున్నారు. జిల్లాస్థాయిలోకి వచ్చే మిగతా పోస్టులకు కూడా ఇదేవిధంగా అమలు చేస్తారని తెలుస్తోంది. జోనల్, మల్టీజోనల్ స్థాయి ఉద్యోగాలకు మాత్రం 1:2 నిష్పత్తిలోనే భర్తీ చేయనున్నారు. By B Aravind 04 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Good News For Un Employees : రాష్ట్రంలో జిల్లాస్థాయి కేటగిరీ ఉద్యోగాల్లో గ్రూప్-4 ఉద్యోగాలు(Group-4 Jobs) పెద్ద సంఖ్యలో ఉన్నాయి. మొత్తం 9 వేల ఉద్యోగాలు ఉండగా.. వీటిని భర్తీ చేసేందుకు 1:3 నిష్పత్తి ఫార్ములాను అమలు చేయనున్నారు. అంతేకాదు జిల్లాస్థాయిలోకి వచ్చే మిగతా పోస్టులకు కూడా ఇదేవిధంగా అమలు చేస్తారని తెలుస్తోంది. ఈ పద్ధతి ద్వారా ఎక్కువ మంది అభ్యర్థులను ఎంపిక చేయడంతో అన్నీ పోస్టులను కూడా భర్తీ చేయొచ్చని కమిషన్ యోచిస్తోంది. అయితే జోనల్, మల్టీజోనల్ స్థాయి ఉద్యోగాలకు మాత్రం 1:2 నిష్పత్తిలోనే భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అంశాలపై త్వరలో నిర్ణయం తీసుకోని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. Also Read: ఏఐ సిటీ కోసం హైదరాబాద్‌లో 200 ఎకరాలు కేటాయించాం: శ్రీధర్ బాబు TSPSC ఇప్పటివరకు నిర్వహించిన అర్హత పరీక్షల్లో మెజారిటీ పరీక్షలకు 'కీ' లు, జవాబుపత్రాల 'కీ', మెజారిటీ పరీక్షలకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ జాబితాలను(జీఆర్ఎల్) సైతం కమిషన్ విడుదల చేసింది. అయితే జీఆర్‌ఎల్‌కు సంబంధించి ఇప్పుడు ప్రాథమిక ఎంపిక జాబితాను రిలీజ్ చేయాల్సి ఉంది. ఇందుకోసం అంతర్గత ప్రక్రియను అధికారులు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ప్రాథమిక ఎంపిక జాబితా ప్రకటన కోసం టీఎస్‌పీఎస్సీ కసరత్తులు చేస్తోంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ ఉండటంతో.. ఇది ముగిసిన తర్వాత ప్రాథమిక ఎంపిక లిస్ట్‌ను ప్రకటించడం, ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ , చివరగా తుది జాబితాల ప్రకటన చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. అయితే ఇప్పుడు జిల్లాస్థాయి, జోనల్ స్థాయి, మల్టీజోనల్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా.. ఇప్పటిదాకా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాలు బోర్డు(TREIRB) , తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామకాల బోర్డు(TSLPRB), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(TMHSRB) లు ప్రాథమిక లిస్ట్ ఎంపికలో 1:2 నిష్పత్తిని నిర్ధారించుకొని ఉద్యోగాల భర్తీని పూర్తి చేశాయి. మొత్తంగా 33 ఉద్యోగాలను ఇదే పద్దతిలో భర్తీ చేశారు. Also Read: కవితకు మరో షాక్ అందుకే 1:3 నిష్పత్తి నోటిఫికేషన్‌లో నిర్దేశించిన పోస్టులు, భర్తీ ప్రక్రియను పరిశీలిస్తే.. మొత్తంగా 15 శాతం ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోతాయి. ఒక్కో అభ్యర్థికి రెండు, అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం, అలాగే అన్ని రకాల పోస్టులకు సంబంధించి ధృవపత్రాల పరిశీలనకు హాజరుకావడం, ప్రాధాన్యత క్రమంలో నచ్చిన ఉద్యోగాన్ని ఎంచుకోవడం, సరైన అభ్యర్థులు లేకపోవడం వంటి కారణాల వల్ల ఇలా మిగిలిపోయినట్లు అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకోసమే అర్హుల ఎంపికకు 1:3 నిష్పత్తిని అనుసరించాలని నిర్ణయం తీసుకున్నారు. #telugu-news #telangana-news #tspsc #telangana-group-4 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి